Asianet News TeluguAsianet News Telugu

టాప్ టెన్‌లో చేరిన కోహ్లీ...క్రికెట్ దిగ్గజం లారాను వెనక్కినెట్టి

నేపియర్ వేదికన జరిగిన మొదటి వన్డేలో టీంఇండియా ఆటగాళ్లు సమిష్టిగా రాణించి ఘన విజయం సాధించారు. మొదట బౌలింగ్ లో ఆ తర్వాత బ్యాటింగ్ లో తమ సత్తా ఏంటో చాటి న్యూజిలాండ్ జట్టును వారి స్వదేశంలోనే మట్టికరిపించింది. ఈ క్రమంలో టాప్ స్కోరర్లుగా నిలిచిన టీంఇండియా ఆటగాళ్లిద్దరు కూడా విండిస్ క్రికెట్ దిగ్గజం బ్రయాన్ లారా రికార్డులనే బద్దలుగొట్టారు. లారా వేగవంతమైన 5 వేల పరుగుల రికార్డు ధావన్ సమంచేయగా, 10 వేల పరుగుల రికార్డును కోహ్లీ అధిగమించాడు. ఇలా ఒకే మ్యాచ్‌లో...ఒకే  ఆటగాడి(లారా) రికార్డులను... ఒకే జట్టు సభ్యులు(కోహ్లీ, ధావన్) బద్దలుగొట్టారు.  
 
team india captain virat kohli joined top ten list
Author
Napier, First Published Jan 23, 2019, 4:29 PM IST

నేపియర్ వేదికన జరిగిన మొదటి వన్డేలో టీంఇండియా ఆటగాళ్లు సమిష్టిగా రాణించి ఘన విజయం సాధించారు. మొదట బౌలింగ్ లో ఆ తర్వాత బ్యాటింగ్ లో తమ సత్తా ఏంటో చాటి న్యూజిలాండ్ జట్టును వారి స్వదేశంలోనే మట్టికరిపించింది. ఈ క్రమంలో టాప్ స్కోరర్లుగా నిలిచిన టీంఇండియా ఆటగాళ్లిద్దరు కూడా విండిస్ క్రికెట్ దిగ్గజం బ్రయాన్ లారా రికార్డులనే బద్దలుగొట్టారు. లారా వేగవంతమైన 5 వేల పరుగుల రికార్డు ధావన్ సమంచేయగా, 10 వేల పరుగుల రికార్డును కోహ్లీ అధిగమించాడు. ఇలా ఒకే మ్యాచ్‌లో...ఒకే  ఆటగాడి(లారా) రికార్డులను... ఒకే జట్టు సభ్యులు(కోహ్లీ, ధావన్) బద్దలుగొట్టారు.  

భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన పరుగుల సునామీని కొనసాగిస్తూ వన్డేల్లో ఇటీవలే పదివేల పరుగులను పూర్తిచేసుకున్న విషయం తెలిసిందే. ఇలా అతి వేగంగా పదివేల పరుగుల మైలురాయిని( కేవలం 220 మ్యాచుల్లోనే) అందుకున్న ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అయితే తాజాగా నేపియర్ వన్డేలో 45 పరుగులు సాధించిన కోహ్లీ వెస్టిండిస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారాను అధిగమించాడు. 

లారా వన్డేల్లో 10,405 పరుగుల రికార్డును అధిగమిస్తూ కోహ్లీ పరుగులు 10,430 కి చేరుకున్నారు. ఇలా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఇప్పటివరకు 10వ స్థానంలో కొనసాగిన లారాను వెనక్కినెట్టి కోహ్లీ టాప్ టెన్ లో చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 18,426 పరుగులతో మొదటి స్థానంలో వుండగా...మొత్తంగా టాప్ టెన్ లో నలుగురు భారత ఆటగాళ్లే వుండటం విశేషం. 

ఇక ఇదే మ్యాచ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా లారా మరో రికార్డును సమం చేశాడు.  వన్డే క్రికెట్లో వేగంగా 5వేల పరుగులు పూర్తి చేసుకుని ధావన్ రికార్డు నెలకొల్పాడు. లారా 118 ఇన్నింగ్సుల్లో 5  వేల పరుగుల ఘనత సాధిస్తే...ధావన్ కూడా అన్ని మ్యాచుల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఇలా వీరిద్దరు కలిసి దక్షాణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా(101), వివ్ రిచర్డ్స్, విరాట్ కోహ్లీ(114) తర్వాత మూడో స్థానంలో నిలిచారు.

సంబంధిత వార్తలు

తొలి వన్డేలో విచిత్రం...కివీస్ కంటే ఒక పరుగు తక్కువైనా భారత్‌దే విజయం

క్రికెట్ దిగ్గజం లారా వరల్డ్ రికార్డును సమంచేసిన ధావన్...

న్యూజిలాండ్ వన్డే.. చెలరేగిన చాహల్

తొలి వన్డే: భారత్ చేతిలో కివీస్ చిత్తు

15ఏళ్ల నాటి రికార్డ్ ని బ్రేక్ చేసిన షమీ

Follow Us:
Download App:
  • android
  • ios