న్యూజిలాండ్‌ జట్టుతో వారి స్వదేశంలోజరుగుతున్న వన్డే సీరిస్‌ను భారత్ ఘనంగా ఆరంభించింది. నేపియర్‌లో జరుగుతున్న మొదటి వన్డే కివీస్ ఆటగాళ్లను బెంబేలెత్తించిన భారత బౌలర్లు తక్కువ స్కోరుకే ఆ జట్టును ఆలౌట్ చేశారు. అనంతరం చేదనకు దిగిన భారత్ కు శుభారంభాన్నిచ్చి గెలుపు దిశగా నడింపించిన ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో వీండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా పేరిట వున్న రికార్డును సమం చేసి కోహ్లీ తర్వాతి స్థానంలో నిలిచాడు. 

ఈ మ్యాచ్ ద్వారా శిఖర్ ధావన్ తన వన్డే క్రికెట్ కెరీర్లో 5వేల పరుగుల మైలురాయికి చేరుకున్నాడు. భారత జట్టు తరపున అత్యంత వేగంగా 5 వేల పరుగులను పూర్తిచేసుకున్న ఘనత కెప్టెన్ కోహ్లీ పేరిట వుండగా అతడి తర్వాతి స్థానాన్ని ధావన్ ఆక్రమించాడు. కోహ్లీ ఈ మార్కును చేరుకోడానికి కేవలం 114 మ్యాచులు ఆడాల్సివస్తే ధావన్ కు 118 మ్యాచ్ లు ఆడాల్సి వచ్చింది.  

అయితే ప్రపంచ క్రికెట్లో వేగవంతమైన 5వేల  పరుగుల రికార్డు దక్షాణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా పేరిట వుంది. అతడు కేవలం 101 మ్యాచుల్లో ఈ ఘనత సాధించాడు. అతడి తర్వాత వివ్ రిచర్డ్స్, విరాట్ కోహ్లీ 114 మ్యాచులతో రెండో స్థానంలో వున్నారు. తాజాగా విండీస్ క్రికెట్ దిగ్గజం బ్రయాన్ లారా రికార్డును శిఖర్ ధావన్ సమం చేస్తూ 118 మ్యాచుల్లో ఈ ఘనత సాధించాడు. దీంతో ఇద్దరు కలిసి మూడో స్థానంలో నిలిచారు. 

నేపియర్ వన్డేలో టిమ్ సౌథి వేసిన ఆరో ఓవర్లో సింగిల్ తీసి  శిఖర్ తన ఐదు వేల పరుగులను పూర్తిచేసుకున్నాడు. ఈ మ్యాచ్ కు ముందు ధావన్ తన వన్డే కెరీర్లో 15 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీల ద్వారా ఈ  ఘనత సాధించాడు. నేపియర్ మ్యాచ్ ధావన్  26వ  అర్థశతకంతో మెరిసి జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ధావన్ 103    బంతుల్లో 75 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

 

సంబంధిత వార్తలు

న్యూజిలాండ్ వన్డే.. చెలరేగిన చాహల్

తొలి వన్డే: భారత్ చేతిలో కివీస్ చిత్తు

15ఏళ్ల నాటి రికార్డ్ ని బ్రేక్ చేసిన షమీ