న్యూజిలాండ్ పర్యటనను భారత జట్టు ఘనంగా ఆరంభించింది. వారి స్వదేశంలో జరుగుతున్న వన్డే సీరిస్‌లో మొదటి విజయం సాధించి కివీస్ జట్టుకు సవాల్ విసిరింది. నేపియర్ వన్డేలో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండు విబాగాల్లోనూ రాణించిన భారత జట్టు తన విజయాల పరంపరను కొనసాగింది. అయితే ఈ మ్యాచ్ లో వాతావరణ పరిస్థితుల కారణంగా ఓ విచిత్రం చోటుచేసుకుంది. కివీస్ నిర్దేశించిన లక్ష్యం కంటే ఓ పరుగు తక్కువ చేసినప్పటికి భారత్ విజయం సాధించింది. 

ఈ వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు భారత్ బౌలర్ల దాటికి తట్టుకోలేకపోయింది. దీంతో కేవలం 38 ఓవర్లలో 157 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయ్యింది. ఈ క్రమంలో బ్యాటింగ్ దిగిన భారత జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్(75 నాటౌట్), కెప్టెన్ కోహ్లీ(45) రాణించడంతో కేవలం 34 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించి విజయం సాధించింది. భారత్ కివీస్ సాధించిన 157 పరుగుల కంటే ఓ పరుగు(156) తక్కువగా వుండగానే విజయం సాధించింది. ఈ విచిత్రం వాతావరణ పరిస్థితుల కారణంగా ఏర్పడింది. 

లంచ్ బ్రేక్ కు ముందే కివీస్ ఆలౌటవడంతో వెంటనే భారత్ బ్యాటింగ్ దిగింది. ఈ క్రమంలో కొద్దిసేపు వెలుతురు మందగించడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఆ తర్వాత పరిస్థితి చక్కబడటంతో మ్యాచ్ ప్రారంభించి డక్ వర్త్ లూయిస్ పద్దతిలో భారత లక్ష్యాన్ని 49 ఓవర్లలో 156 పరుగులుగా కుదించారు. దీంతో భారత్ కివీస్ కంటే ఒక్క పరుగు తక్కువ చేసి కూడా విజయాన్ని అందుకుంది. 

మొదట బ్యాటింగ్ కు దిగిన కివీస్ జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో భారత్ స్పిన్నర్లు ముఖ్య పాలత్ర పోషించారు. కుల్‌దీప్ యాదవ్ (4), చాహల్ (2) వికెట్లు పడగొట్టగా పేసర్ షమీ 3 వికెట్లు తీశాడు.  ఆ తర్వాత బ్యాటింగ్ లో రోహిత్ తొందరగానే ఔటయినా ధావన్, కోహ్లీ లు రాణించడంతో భారత్ సూనాయాసంగానే విజయాన్ని అందుకుంది. కివీస్ నిర్దేశించిన టార్గెట్ ను భారత్ కేవలం 34 ఓవర్లలోనే చేదించి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

సంబంధిత వార్తలు

క్రికెట్ దిగ్గజం లారా వరల్డ్ రికార్డును సమంచేసిన ధావన్...

న్యూజిలాండ్ వన్డే.. చెలరేగిన చాహల్

తొలి వన్డే: భారత్ చేతిలో కివీస్ చిత్తు

15ఏళ్ల నాటి రికార్డ్ ని బ్రేక్ చేసిన షమీ