Asianet News TeluguAsianet News Telugu

15ఏళ్ల నాటి రికార్డ్ ని బ్రేక్ చేసిన షమీ

భారత్-న్యూజిలాండ్ మధ్య నేపియర్ వేదికగా జరగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో టీం ఇండియా క్రికెటర్ మహ్మద్ షమీ రికార్డ్ సృష్టించాడు. 

India vs New Zealand: Mohammed Shami fastest Indian to 100 ODI wickets
Author
Hyderabad, First Published Jan 23, 2019, 10:03 AM IST

భారత్-న్యూజిలాండ్ మధ్య నేపియర్ వేదికగా జరగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో టీం ఇండియా క్రికెటర్ మహ్మద్ షమీ రికార్డ్ సృష్టించాడు. అరుదైన రికార్డ్ ని షమీ తన సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో రెండో ఓవర్ లోనే కివీస్ కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ ఔట్ చేసిన సంగతి తెలిసిందే. 

అయితే.. ఈ ఔట్ తో  భారత్ తరఫున వేగంగా 100 వికెట్ల మైలురాయిని అందుకున్న ఫాస్ట్ బౌలర్‌గా షమీ నిలిచాడు. కెరీర్‌లో 56వ వన్డే ఆడుతున్న షమీ 5.51 ఎకానమీతో ఈ వంద వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. 15ఏళ్ల క్రితం ఇర్ఫాన్ పఠాన్ చేసిన ఈ రికార్డ్ ని ఇప్పుడు షమీ బ్రేక్ చేశాడు.

పాకిస్థాన్‌తో 15ఏళ్ల క్రితం అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇర్ఫాన్ పఠాన్ తన 59వ వన్డేలో 100 వికెట్ల మైలురాయిని అందుకోగా.. షమీ 56వ వన్డేతోనే ఆ మార్క్‌ని చేరుకున్నాడు. ఈ జాబితాలో షమీ, పఠాన్ తర్వాత.. జహీర్ ఖాన్ 65 వన్డేల్లో, అజిత్ అగార్కర్ 67 వన్డేల్లో, జవగళ్ శ్రీనాథ్ 68 వన్డేల్లో ఈ వంద వికెట్ల మైలురాయిని అందుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios