భారత్ -న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో యువ క్రికెటర్  చాహల్ మరోసారి తన సత్తా చాటాడు. ఇప్పటికి న్యూజిలాండ్ ఐదు వికెట్లు కోల్పోయింది. కాగా.. ఆట మొదలుపెట్టిన కొద్దిసేపటికే న్యూజిలాండ్ వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది.

మ్యాచ్  ప్రారంభంలలోనే ఓపెనర్లు గుప్తిల్(5), మన్రో(8) ఇద్దిరినీ షమీ పెవిలియన్ కు పంపించాడు. కాగా తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన రాస్‌ టేలర్ (24), టామ్‌ లాథమ్‌ (11) ఇద్దరినీ చాహల్ పెవిలియన్‌కు పంపాడు. చాహల్‌ వేసిన ఓవర్లో ఇద్దరూ కూడా అతనికే క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగారు. ప్రస్తుతం క్రీజులో విలియమ్‌సన్ (30), హెన్రీ నికోల్స్‌ (4) ఉన్నారు.25 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్‌ స్కోరు 109/5.