మౌంట్‌ మాంగనీ: టీమిండియా సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి తన మెరుపు వేగంతో కూడిన స్టంపింగ్ ద్వారా ఫ్యాన్స్ ను ఫిదా చేశాడు. మౌంట్‌ మాంగనీలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 

ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ వేసిన కేదార్ జాదవ్‌ తొలిబంతిని కాస్తా తక్కువ వేగంతో విసిరాడు. దీంతో కివీస్ బ్యాట్స్‌మన్‌ టేలర్‌ దాన్ని అంచనా వేయలేకపోయాడు. ముందుకు వచ్చి బంతిని నెట్టేయడానికి ప్రయత్నించాడు. అయితే అది వెళ్లి ధోని చేతిలో పడింది. ధోనీ క్షణాల్లో వికెట్లను పడగొట్టాడు. దాంతో టేలర్‌ పెవిలియన్ చేరుకున్నాడు. 

టేలర్‌ను ఔట్‌ చేయడం ద్వారా ధోనీ ఖాతాలో 119వ స్టంపింగ్‌ చేరింది. 337 వన్డే మ్యాచులు ఆడదిన ధోని 311 క్యాచ్‌ ఔట్లు, 119 స్టంపింగ్‌లు చేశాడు. అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు (520) ఆడిన వికెట్‌ కీపర్‌ ధోనియే కావడం కూడా విశేషం. 

ప్రపంచ అత్యుత్తమ వికెట్‌ కీపర్ల జాబితాలో కుమార సంగక్కర, ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ తరువాతి స్థానంలో ధోని కొనసాగుతున్నాడు. 

సంబంధిత వార్తలు

రెండో వన్డే: కుల్దీప్ జోరు, కివీస్ పై భారత్ ఘన విజయం

కుల్దీప్ జాదవ్ జోరు: రెండో బౌలర్ గా ఘనత

ఓపెనింగ్ రికార్డులను బద్దలుగొట్టిన రోహిత్-శిఖర్ జోడీ...

మరో రికార్డ్.. రెండో క్రికెటర్ కోహ్లీ