టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్- న్యూజిలాండ్ ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ లలో అత్యధిక పరుగులు చేసిన రెండో క్రికెటర్ గా కోహ్లీ నిలిచాడు. శనివారం న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు.

ఈ మ్యాచ్‌లో కోహ్లి(43; 45 బంతుల్లో 5 ఫోర్లు) స్కోరును పెంచే క్రమంలో భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. కాగా, ఇరు జట్ల మధ్య జరిగిన ఓవరాల్‌ వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో రెండో స్థానాన్ని ఆక్రమించాడు. న్యూజిలాండ్‌పై వన్డేల్లో కోహ్లి సాధించిన పరుగులు 1242. మొదటి స్థానంలో సచిన్ టెండుల్కర్(1750) ఉండగా.. రెండో స్థానంలో కోహ్లీ నిలిచాడు. ఆ తర్వాత నాల్గో స్థానంలో వీరేంద్ర సెహ్వాగ్ నిలిచాడు.