ఐదు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా శనివారం జరిగిన రెండో వన్డేలో భారత్ తమ ముందు ఉంచిన 325 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ 90 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో భారత్ సిరీస్ లో 2-0 స్కోరుతో ముందంజలో ఉంది. కుల్దీప్ యాదవ్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో భారత్ కు విజయాన్ని సాధించి పెట్టాడు. కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్ 234 పరుగులకు చేతులెత్తేసింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్, చాహల్ రెండేసి వికెట్లు తీశారు. మొహమ్మద్ షమీ, కేదార్ జాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.

చివరలో న్యూజిలాండ్ ఓటమి బాట పట్టిన సమయంలో బ్రేస్ వెల్ చెలరేగి ఎట్టకేలకు అవుటయ్యాడు. అతను అర్థ సెంచరీ పూర్తి చేసి భారత బౌలర్లకు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. భువనేశ్వర్ కుమార్ బౌలింగులో 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతను అవుటయ్యాడు. దీంతో న్యూజిలాండ్ 224 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది.

అంతకు ముందు కివీస్ 165 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది.కుల్దీప్ యాదవ్ నికోల్స్, గ్రాంథోమ్ వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ న్యూజిలాండ్ పాలిటి శాపంగా మారాడు. కుల్దీప్ దెబ్బకు సోథి డకౌట్ అయ్యాడు. దీంతో న్యూజిలాండ్ 166 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ ను జారవిడుచుకుంది.న్యూజిలాండ్ 136 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. 34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లాథమ్ కుల్దీప్ యాదవ్ బౌలింగులో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

న్యూజిలాండ్ 100 పరుగుల స్కోరు వద్ద నాలుగో వికెట్ ను జారవిడుచుకుంది. రాస్ టైలర్ 22 పరుగులు చేసి జాదవ్ బౌలింగులో అవుటయ్యాడు. అంతకు ముందు కివీస్ 84 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. నిలకడగా ఆడుతూ వచ్చిన మన్రో చాహల్ బౌలింగులో 31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. న్యూజిలాండ్ 51 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిది. మొహమ్మద్ షమీ బౌలింగులో విలియమ్సన్ 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.

అంతకు ముందు 23 పరుగుల స్కోరు వద్ద తొలి వికెట్ కోల్పోయింది. గుప్తిల్ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భువనేశ్వర్ కుమార్ బౌలింగులో చాహల్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు.

రెండో వన్డేలోోనూ భారత బ్యాట్ మెన్స్ తమ జోరు కొనసాగించారు.. దీంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 324 పరుగులు చేసింది. చివరి ఓవర్లలో మహేంద్ర సింగ్ ధోని(48 పరుగులు 33 బంతుల్లో), కేధార్ జాదవ్( 22 పరుగులు 10 బంతుల్లో) మరోసారి రెచ్చిపోయారు. దీంతో చివరి 5 ఓవర్లలో భారత్ 11.40 రన్ రేట్ తో 57 పరుగులు రాబట్టి కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయింది. 

 భారత్ 271 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. అంబటి రాయుడు 47 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫెర్గూసన్ బౌలింగులో పెవిలియన్ చేరుకున్నాడు. న్యూజిలాండ్ పై జరిగిన రెండో వన్డే మ్యాచులో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్థ సెంచరీ మిస్సయ్యాడు. 43 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతను బౌల్ట్ బౌలింగ్ లో సోధీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ 236 పరుగుల వద్ద మూడ ోవికెట్ కోల్పోయింది. అప్పటికి 39.1 ఓవర్లు పూర్తయ్యాయి.

మౌంట్ మంగనూయి వన్డేలో భారత  ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ మిసయ్యాడు. అతడు 96 బంతుల్లో 87 పరుగులు చేసి ఫెర్గ్‌సన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో భారత్ 172 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(16) , రాయుడు వున్నారు.  రెండో వన్డేలో భారత ఓపెనింగ్ జోడిని విడగొట్టడంతో కివస్ ఎట్టకేలకు సఫలమయ్యింది. 154 స్కోరు వద్ద శిఖర్ ధావన్(66) ను కివీస్ భౌలర్ లథామ్ వెనక్కి పంపాడు. 

భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ రెండో వన్డేలో చేలరేగి ఆడారు.దీంతో భారత్ స్కోరు 18 ఓవర్లలో సెంచరీని దాటింది. ఈ క్రమంలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఇద్దరూ అర్థశతకాలను నమోదు చేసుకున్నారు. భారత  ఓపెనర్లు ధాటిగా బ్యాటింగ్ ఆరంభించారు. దీంతో మొదటి పది ఓవర్లలోనే భారత్ స్కోరు హాఫ్ సెంచరీని దాటింది. రోహిత్ శర్మ(30), శిఖర్ ధావన్(24)తో క్రీజులో వున్నారు. మొత్తంగా భారత్ వికెట్లువీ కోల్పోకుండానే 10 ఓవర్లలో 56 పరుగులు చేసింది.  

భారత్-ఆస్ట్రేలియాల మధ్య మౌంట్ మాంటగనూయిలో రెండో వన్డే ప్రారంభమయ్యింది. మొదట టాస్ గెలిచిన భారత సారథి విరాట్ కోహ్లీ బ్యాటింగ్్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం ఓపెనర్లు రోహిత్ శర్మ(13పరుగులు), శిఖర్ ధావన్(6 పరుగులు) క్రీజులో వున్నారు.  ప్రస్తుతం టీంఇండియా 3.4 ఓవర్లలో 21 పరుగులు చేసింది. స్వదేశంలో జరుగుతున్న ఐదు వన్డేల సీరిస్‌లో భాగంగా ఇప్పటికే జరిగిన నేపియర్ వన్డేలో కివీస్ జట్టు ఓటమి పాలైన విషయం తెలిసిందే.