Asianet News TeluguAsianet News Telugu

నా హీరో ఇక లేడు: ఫుట్ బాల్ దిగ్గజం మృతిపై గంగూలీ భావోద్వేగం

అర్జెంటినా ఫుట్ బాల్ దిగ్గజం మారడోనా అకాల మృతికి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సంతాపం తెలిపారు. 

Sourav Ganguly mourns Diego Maradona's death
Author
Hyderabad, First Published Nov 26, 2020, 8:16 AM IST

స్పోర్ట్స్ డెస్క్: పుట్ బాల్ దిగ్గజం డిగో మారడోనా(60) అకాల మృతితో క్రీడా ప్రపంచంలో విషాదం నెలకొంది. ముఖ్యంగా పుట్ బాల్ ప్రియులు మారడోనా ఇక లేడన్న ఛేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా పుట్ బాల్ ను అభిమానించే టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుతం బిసిసిఐ అధ్యక్షులు సౌరవ్ గంగూలీ మారడోనాను అంతకంటే పెద్ద అభిమాని. ఈ క్రమంలో మారడోనా మృతికి సంతాపం తెలుపుతూ ట్వీట్టర్ వేదికన తన ఆవేదనను, మారడోనాపై అభిమానాన్ని తెలియజేశాడు. 

 ''నా హీరో ఇక లేడు .. నా పిచ్చి మేధావి ఇక ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో.. నేను మీ కోసం ఫుట్‌బాల్ చూశాను '' అంటూ మారడోనాతో కలిసున్న ఫోటోను జతచేస్తూ గంగూలీ ఎమోషనల్ గా ట్వీట్ చేశాడు.

1986లో అర్జెంటీనాకు మారడోనా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ అందించారు. ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడిగా ఆయన కీర్తి గడించారు. అర్జెంటినా జట్టు తరపున ఆడే సమయంలో మారడోనా మెరుపు వేగంతో గోల్స్ కొడుతూ ఫుట్‌బాల్ ఆటలో ‘ది గోల్డెన్ బాయ్’’గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు.  1960 అక్టోబర్ 30న అర్జెంటీనాలో జన్మించారు మారడోనా 60 ఏళ్ల వయసులో గుండెపోటుతో కన్నుమూశారు.  

నాలుగు సార్లు ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో పాల్గొన్న డిగో.. 1990 ప్రపంచకప్‌లో అర్జెంటీనా జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లారు. 1991లో డోపింగ్ టెస్టులో పట్టుబడి 15 నెలల పాటు నిషేధానికి గురయ్యారు. 1997లో ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. 2008లో అర్జెంటీనా జాతీయ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించారు. యూఏఈ, మెక్సికో జాతీయ జట్లకు మేనేజర్‌గాను విధులు నిర్వర్తించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios