ఆరంగేట్ర మ్యాచ్ లోనే విఫలమైన యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్(9 పరుగులు) కు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మద్దతుగా నిలిచాడు. హమిల్టర్ వన్డేలో భారత జట్టు మొత్తం వైఫల్యం చెందిందని...ఇది ఏ ఒక్కరి వల్లో జరిగింది కాదన్నారు. సీనియర్ ఆటగాళ్లు బ్యాటింగ్ చేయడానికి తడబడిన పిచ్ పై ఆరంగేట్ర ఆటగాడు ఒత్తిడికి గురై వికెట్ సమర్పించుకోవడం సహజమంటూ శుభ్ మన్ కు గవాస్కర్ అండగా నిలిచారు. 

శుభ్ మన్ ఆటతీరును తాను దగ్గరుండి చూశానని... అతడికి క్రికెటర్ గా మంచి భవిష్యత్ ఉందని గవాస్కర్ తెలిపాడు. అతడు భారత జట్టులో కీలక ఆటగాడిగా మారడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. హమిల్టన్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ కెరీర్ ఆరంభించిన అతడు భవిష్యత్ లో టీంఇండియాకు మంచి విజయాలు సాధించిపెడతాడని గవాస్కర్ పేర్కొన్నాడు. 

అంతర్జాతీయ క్రికెట్ లో గిల్ కు ఇది మొదటి మ్యాచ్ అని...దాంతో సహజంగానే అతడిపై కాస్త ఒత్తిడి వుంటుందన్నారు. దానికి తోడు సీనియర్లంతా విపలమవడంతో అతడిపపై ఒత్తిడి మరింత పెరింగిందన్నారు. ఆ విషయం అతడి బ్యాటింగ్ ను చూస్తే అర్థమవుతుందని వివరించారు. ఇలాంటి సమయంలో బ్యాటింగ్ సాగించడం ఏ ఆటగాడికైనా కష్టమేన్నాడు. 

అంతేకాకుండా కివీస్ బౌలర్ బౌల్ట్ పిచ్ పరిస్ధితులకు అనుగుణంగా తన స్వింగ్ బంతులతో భారత ఆటగాళ్లను బెంబేలెత్తించాడని గవాస్కర్ తెలిపాడు. శుభ్ మన్ కూడా అతడి బౌలింగ్ లో చాలా ఇబ్బందిపడ్డాడని...ఓ బంతి స్వింగ్ అవుతూ వచ్చి ప్రమాదకమైన రీతిలో అతడి హెల్మెట్ కు బలంగా తగిలిందన్నారు. ఇలా కఠిన పరిస్థితుల్లో బ్యాటింగ్ కొనసాగించలేక గిల్ ఔటయ్యాడని గవాస్కర్ వివరించాడు. 

అయితే ఈ ఒక్క మ్యాచ్ ద్వారానే అతడి ఆటతీరుపై ఓ అంచనాకు రావొద్దని గవాస్కర్ టీంఇండియా మేనేజ్ మెంట్ కు సూచించారు. మరిన్ని అవకాశాలు కల్పించి అతడిలోని ఆటగాడిని ప్రోత్సహించాలని గవాస్కర్ సెలెక్టర్లను కోరారు.   

 

సంబంధిత వార్తలు

హమిల్టన్ వన్డే ద్వారా అరుదైన ఘనత సాధించిన రోహిత్

కివీస్ చేతిలో ఓటమి: వన్డే చరిత్రలోనే భారత్ అరుదైన చెత్త రికార్డు

అందుకే ఆయన "ది గ్రేటెస్ట్": తనపై కోప్పడినా...ధోనీపై ఖలీల్ ప్రశంసలు

టీమిండియా చెత్త ప్రదర్శనపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కామెంట్లు: అభిమానుల ఫైర్

నాలుగో వన్డే: కోహ్లీ లేని మ్యాచులో భారత్ పై కివీస్ ప్రతీకారం

హామిల్టన్ అవమానం: రోహిత్ శర్మ అప్ సెట్