ఐదు వన్డేల సీరిస్ ను ఇప్పటికే కైవసం చేసుకున్న భారత్ కు హమిల్టన్ వన్డేలో మాత్రం ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. కేవలం 92 పరుగులకే టీంఇండియా ఆలౌటై చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇలాంటి మ్యాచ్ లో కూడా భారత ఓపెనర్, ప్రస్తుత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. 

హమిల్టన్ వన్డే ద్వారా రోహిత్ తన కెరీర్లో 200 వన్డే మ్యాచ్ ను పూర్తిచేసుకున్నాడు. ఇలా ఇప్పటివరకు కేవలం 13 మంది భారత ఆటగాళ్లు మాత్రమే ఈ మైలురాయిని అందుకోగా తాజా మ్యాచ్ ద్వారా రోహిత్ ఆ ఖాతాలోకి చేరిపోయాడు. ఇలా రోహిత్ భారత దిగ్గజ ఆటగాళ్ల సరసన చేరిపోయాడు. 

అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వన్డేల రికార్డు లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట వుంది. అతడితో సౌరవ్ గంగూలి, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, మహ్మద్ అజారుద్దిన్, జవగల్ శ్రీనాథ్ వంటి దిగ్గజాలు సచిన్ తర్వాతి స్థానాల్లో వున్నారు. టీంఇండియా మాజీ కెప్టెన్ ధోని, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీలు కూడా ఇదివరకే ఈ ఘనత సాధించారు. తాజాగా 200 వన్డేను పూర్తి చేసుకుని రోహిత్ వీరందరి సరసన చేరాడు. 

న్యూజిలాండ్ గడ్డపై ఐదు వన్డేల సీరిస్‌ను ఘనంగా ప్రారంభించి వరుసగా మూడు వన్డేల్లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో మరో రెండు వన్డేలు మిగిలుండగానే సీరిస్ ను కైవసం చేసుకున్న భారత్ నాలుగో వన్డేలో మాత్రం ఘోరంగా విఫలమయ్యింది. భారత జట్టు కెప్టెన్ కోహ్లీ విశ్రాంతి తీసుకోవడంతో ఈ వన్డేకు రోహిత్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే మొదట బ్యాటింగ్ చేసిన భారత్ కేవలం 92 పరుగులకే ఆలౌటవగా..కివీస్ 14.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. దీంతో టీంఇండియా ఘోర ఓటమిని చవిచూసింది. 

 

సంబంధిత వార్తలు 

కివీస్ చేతిలో ఓటమి: వన్డే చరిత్రలోనే భారత్ అరుదైన చెత్త రికార్డు

అందుకే ఆయన "ది గ్రేటెస్ట్": తనపై కోప్పడినా...ధోనీపై ఖలీల్ ప్రశంసలు

టీమిండియా చెత్త ప్రదర్శనపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కామెంట్లు: అభిమానుల ఫైర్

నాలుగో వన్డే: కోహ్లీ లేని మ్యాచులో భారత్ పై కివీస్ ప్రతీకారం

హామిల్టన్ అవమానం: రోహిత్ శర్మ అప్ సెట్