ఇదొక చెత్త ప్రదర్శన అని రోహిత్ శర్మ అన్నాడు. మ్యాచ్ అనంతరం అతను మాట్లాడుతూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం ేచశాడు. సుదీర్ఘ కాలం తర్వాత భారత్ చవి చూసిన అత్యంత చెత్త ప్రదర్శనల్లో ఇదొకటి అని అభివర్ణించాడు.
హామిల్టన్: న్యూజిలాండ్ పై హామిల్టన్ వన్డేలో జరిగిన అవమానంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్ చేతిలో భారత్ నాలుగో వన్డేలో చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇంతటి ఘోర వైఫల్యాన్ని ఊహించలేదని అతను అన్నాడు.
ఇదొక చెత్త ప్రదర్శన అని రోహిత్ శర్మ అన్నాడు. మ్యాచ్ అనంతరం అతను మాట్లాడుతూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం ేచశాడు. సుదీర్ఘ కాలం తర్వాత భారత్ చవి చూసిన అత్యంత చెత్త ప్రదర్శనల్లో ఇదొకటి అని అభివర్ణించాడు. ప్రధానంగా బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమయ్యామని అన్నాడు.
ఈ రకమైన ఆటను ఊహించలేదని, ఇక్కడ క్రెడిట్ అంతా న్యూజిలాండ్ బౌలర్లదేనని అన్నాడు. వారు అద్భుతమైన బౌలింగ్‌తో తమను కట‍్టడి చేశారని అన్నాడు. ఇది తమ జట్టుకు ఒక గుణపాఠమని, ముఖ్యంగా స్వింగ్ అయ్యే పిచ్‌లపై బ్యాటింగ్ ఎలా చేయాలనేది మ్యాచ్ తర్వాత మా ఆటగాళ్లకు కచ్చితంగా బోధపడుతుందని అభిప్రాయపడ్డాడు.
ఈ మ్యాచ్ ప్రదర్శనకు తమను నిందించుకోక తప్పదని, ఒత్తిడికి గురై వికెట్లను పారేసుకున్నామని, చెత్త షాట్ల ఎంపికతో కివీస్‌కు లొంగిపోయామని అన్నాడు. ఒత్తిడికి లోను కాకుండా కనీసం పోరాటాన్ని కనబరిచి ఉంటే పరిస్థితులు మరో విధంగా ఉండేవని అన్నాడు.
బంతి స్వింగ్ అవుతున్నప్పుడు ఆడటం అనేది ఎప్పుడూ సవాల్‌తో కూడుకున్నదేనని, తాము ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని, ప్రతీ ఒక్క ఆటగాడు ఎక్కడ తప్పు చేశాడో అనే విషయాన్ని విశ్లేషించుకోవాలని అన్నాడు.
సంబంధిత వార్త
నాలుగో వన్డే: కోహ్లీ లేని మ్యాచులో భారత్ పై కివీస్ ప్రతీకారం
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 31, 2019, 1:24 PM IST