ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్-భారత్ మధ్య జరిగిన రెండో టీ20లో టీంఇండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో కివీస్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో ఓవర్ మిగిలుండగానే చేదించింది. గత టీ20లో జరిగిన ఘోర పరాభవానికి ఈ మ్యాచ్ ద్వారా ప్రతీకారం తీర్చుకున్న రోహిత్ అనేక రికార్డులను నెలకొల్పాడు. 

టీ20 మ్యాచుల్లో తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించినప్పటికి రోహిత్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా పేరుతెచ్చుకున్నాడు. అతడు ఇప్పటివరకు 14 మ్యాచుల్లో భారత జట్టుకు సారథ్యం వహించి 12 మ్యాచుల్లో విక్టరీని సాధించిపెట్టాడు. రోహిత్ కెప్టెన్సీలో కేవలం 2 మ్యాచుల్లోనే టీంఇండియా ఓటమిపాలయ్యింది. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న రోహిత్  కెప్టెన్ గా అరుదైన రికార్డును సాధించాడు. 

ఇలా కెప్టెన్ ‌గా 12 మ్యాచుల్లో విజయం సాధించిన రోహిత్ ఆస్ట్రేలియా కెప్టెన్ క్లార్క్, పాకిస్థాన్ కెప్టెన్ సర్పరాజ్ అహ్మద్ లతో కలిసి అగ్రస్థానాన్ని పంచుకున్నాడు. 11 విజయాలతో షోయబ్ మాలిక్, అస్ఘర్ స్టానిక్‌జాయ్, 10 విజయాలతో గ్రేమ్ స్మిత్, మహేల జయవర్థనే ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. 

ఇక ఈ మ్యాచ్ లో రోహిత్ టీ20 బ్యాట్ మెన్ గా కూడా రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గప్టిల్ పేరిట వున్న అత్యధిక పరుగుల రికార్డును రోహిత్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆక్లాండ్ టీ20లో సాధించిన హాఫ్ సెంచరీతో టీ20ల్లో రోహిత్  2,228 పరుగులను పూర్తిచేసుకున్నాడు.ఇప్పటి వరకు ఈ విషయంలో టాప్ లో కొనసాగిన గప్టిల్(2277 పరుగులు) ను తాజాగా సాధించిన 50 పరుగులతో వెనక్కి నెట్టాడు. ఇలా టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. 

సంబంధిత వార్తలు

ఆక్లాండ్ టీ20లో టీమిండియా గెలుపు రహస్యమదే: రోహిత్

టీ20 వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన రోహిత్...

అక్లాండ్ టీ20: రాణించిన బౌలర్లు...టీంఇండియా సునాయాస విజయం

ఔట్ ఎలా ఇస్తారు..? కేన్ అసహనం