టీ20 మ్యాచ్ అంటేనే టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మకు పూనకం వచ్చేలాగుంది. అతడు సాంప్రదాయ టెస్ట్, వన్డేల కంటే ధనాధన్ బ్యాటింగ్ కు సరిపోయే టీ20ల్లోనే బాగా రాణిస్తున్నాడు. అలాంటి ఆటగాడు తాను కెప్టెన్ గా వ్యవహరించిన వెల్లింగ్టన్ టీ20లో భారత్ చిత్తుగా ఓడిపోతే ఊరికే ఉంటాడా... ఆ ఓటమికి ప్రతీకారాన్ని ఆక్లాండ్ లో జరిగిన రెండో టీ20  తీర్చుకున్నాడు. ఈ మ్యాచ్ లో భారీ షాట్లతో విరుచుకుపడ్డ రోహిత్  హాఫ్ సెంచరీ సాధించడమే కాదు తన ఖాతాతో ఓ వరల్డ్ రికార్డ్ ను కూడా వేసుకున్నాడు. 

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ గా రోహిత్ రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గప్టిల్ పేరిట వున్న అత్యధిక పరుగుల రికార్డును రోహిత్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆక్లాండ్ టీ20లో సాధించిన హాఫ్ సెంచరీతో టీ20ల్లో రోహిత్  2,228 పరుగులను పూర్తిచేసుకున్నాడు.ఇప్పటి వరకు ఈ విషయంలో టాప్ లో కొనసాగిన గప్టిల్(2277 పరుగులు) ను తాజాగా  సాధించిన 50 పరుగులతో వెనక్కి నెట్టాడు. ఇలా టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. 

టెస్టు, వన్డేల పరుగుల విషయంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే రోహిత్ వెనుకబడి వుండగా...టీ20 పరుగుల విషయంలో అతడి కంటే ముందున్నాడు. టీ20  విభాగంలో అత్యధిక పరుగుల జాబితాలో రోహిత్, గప్టిల్ మొదటి రెండు స్థానాల్లో వుండగా షోయబ్‌ మాలిక్‌ 2263 పరుగులతో మూడో స్థానంలో, విరాట్‌ కోహ్లి 2167 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నారు.

ఆక్లాండ్ లో జరిగిన రెండో టీ20లో 159 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన టీంఇండియాకు ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. రోహిత్ శర్మ చెలరేగి ఆడుతూ కేవలం  28 బంతుల్లోనే అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత్ రెండో వన్డేలో భారీ విజయాన్ని సాధించి మూడు టీ20ల సీరిస్ ను 1-1 తో సమం చేసింది. 

 

సంబంధిత వార్తలు

అక్లాండ్ టీ20: రాణించిన బౌలర్లు...టీంఇండియా సునాయాస విజయం

ఔట్ ఎలా ఇస్తారు..? కేన్ అసహనం