Asianet News TeluguAsianet News Telugu

ఆక్లాండ్ టీ20లో టీమిండియా గెలుపు రహస్యమదే: రోహిత్

మూడు టీ20ల సీరిల్ భాగంగా ఇవాళ జరిగిన నిర్ణయాత్మక రెండో వన్డేలో టీంఇండియా ఘన విజయం సాధించింది. ఈ విజయవంతమైన మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ వెల్లింగ్టన్ టీ20ని గుర్తుచేసుకున్నాడు. మొదటి టీ20లో తాము చేసిన తప్పుల నుండి గొప్ప పాఠాలు నేర్చుకున్నామని రోహిత్ వెల్లడించాడు. ఆ తప్పిదాలను మరోసారి పునరావృతం కాకుండా చూడటం వల్లే ఈ విజయం  సాధ్యమయ్యిందని రోహిత్ పేర్కొన్నాడు. 

rohit sharma respond on auckland t20 victory
Author
Auckland, First Published Feb 8, 2019, 5:13 PM IST

మూడు టీ20ల సీరిల్ భాగంగా ఇవాళ జరిగిన నిర్ణయాత్మక రెండో వన్డేలో టీంఇండియా ఘన విజయం సాధించింది. ఈ విజయవంతమైన మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ వెల్లింగ్టన్ టీ20ని గుర్తుచేసుకున్నాడు. మొదటి టీ20లో తాము చేసిన తప్పుల నుండి గొప్ప పాఠాలు నేర్చుకున్నామని రోహిత్ వెల్లడించాడు. ఆ తప్పిదాలను మరోసారి పునరావృతం కాకుండా చూడటం వల్లే ఈ విజయం  సాధ్యమయ్యిందని రోహిత్ పేర్కొన్నాడు. 

ఆక్లాండ్  టీ20లో తాము సాధించిన గెలుపు చాలా విలువైనది రోహిత్ అన్నాడు. ఓ ఘోర పరాజయం తర్వాత జట్టు మొత్తం సమిష్టిగా  రాణించి గెలవడం చాలా గొప్ప విషయమన్నాడు. మొదట బౌలింగ్, పీల్డింగ్ ఆ తర్వాత బ్యాటింగ్ లో ప్రతి ఒక్కరు మెరుగ్గా రాణించడం వల్లే ఈ విజయం సాధ్యమయ్యిందని సహచరులను ప్రశంసించాడు. ఈ గెలుపు తనకేంతో ఆనందాన్నిచ్చిందని రోహిత్ పేర్కొన్నాడు. 

తమ జట్టు సభ్యులు చాలా రోజులుగా  విదేశీ పర్యటనలోనే వుండటంతో చాలా ఒత్తిడితో వున్నారని రోహిత్ తెలిపాడు. అందువల్ల కుర్రాళ్లపై మరింత ఒత్తిడి పెంచాలని తాను అనుకోలేదని...అందువల్లే సాధ్యమైనంత ఎక్కువ పరుగులు చేయాలని భావించానని అన్నాడు. మ్యాచ్ కు ముందు తాము రూపొందించిన ప్రణాళికలన్నీ యదావిధిగా అమలు చేయగలిగామని...వాటి ఫలితమే ఈ విజయమని రోహిత్ వెల్లడించాడు.  

 రెండో టీ20లో 159 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన టీంఇండియాకు ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. రోహిత్ శర్మ చెలరేగి ఆడుతూ కేవలం  28 బంతుల్లోనే అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత్ రెండో వన్డేలో భారీ విజయాన్ని సాధించి మూడు టీ20ల సీరిస్ ను 1-1 తో సమం చేసింది. ఇలా వెల్లింగ్టన్ టీ20లో ఎదురైన ఘోర పరాభవానికి ఆక్లాండ్ టీ20 ద్వారా టీంఇండియా బదులు తీర్చుకుంది. 

సంబంధిత వార్తలు

టీ20 వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన రోహిత్...

అక్లాండ్ టీ20: రాణించిన బౌలర్లు...టీంఇండియా సునాయాస విజయం

ఔట్ ఎలా ఇస్తారు..? కేన్ అసహనం

Follow Us:
Download App:
  • android
  • ios