జగజ్జేతగా అవతరించే అవకాశాన్ని తెలుగు తేజం, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు త్రుటిలో కోల్పోయింది. వరుసగా రెండో సారి ఆమె ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఓటమి పాలైంది.

చైనాలోని నాంజింగ్‌లో జరిగిన ఫైనల్లో కరోలినా మారిన్‌తో జరిగిన మ్యాచ్‌లో 21-19, 21-10 తేడాతో సింధు పరాజయం పాలైంది. దీంతో వరుసగా రెండోసారి రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత ఏడాది కాలంలో సింధుని ఫైనల్ ఫోబియా వెంటాడుతూ వస్తోంది... ఐదు మెగా టోర్నీల్లో ఫైనల్లోకి ప్రవేశించి ఐదు సార్లు చివరి మెట్టుపై బోల్తా పడింది. మరోవైపు కరోలినా, సింధు చిరకాల ప్రత్యర్థులు... వీరిద్దరి మధ్య 12 మ్యాచ్‌లు జరగ్గా.. 7 సార్లు కరోలినా, 5 సార్లు సింధు విజయం సాధించారు.