ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 7 లో బెంగాల్ వారియర్స్ విజయయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే వరుస విజయాలతో పాయింట్స్ పట్టికలో టాప్ ఫోర్ లో నిలిచిన వారియర్స్ తమిళ్ తలైవాస్ పై మరో అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో పాయింట్స్ టేబుల్ లో మరింత ముందుకు  దూసుకుపోయింది. అన్ని విభాగాల్లోనూ అదరగొట్టిన బెంగాల్ ఆటగాళ్లు తలైవాస్ ను 9 పాయింట్ల తేడాతో ఓడించింది. 

బెంగాల్ ఆటగాళ్లలో ప్రభంజన్ అత్యధికంగా 10 పాయింట్లు సాధించాడు. మణిందర్ సింగ్ 9, రింకు 6 పాయింట్లతో పరవాలేదనిపించారు. ఇలా ఆటగాళ్ల విజృంభణతో జట్టు రైడింగ్ లో 21, ట్యాకిల్స్ లో 10, ఆలౌట్ల  ద్వారా 4  ఇలా మొత్తం 35 పాయింట్లు సాధించింది.

తమిళ్ తలైవాస్ మాత్రం కేవలం 26 పాయింట్లకే చేతులెత్తేసింది. తలైవాస్ ఆటగాడు అజయ్ ఠాకూర్ ఈ మ్యాచ్ లోనే అత్యధికంగా 11 పాయింట్లు  సాధించి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అయితే అతడి మిగతా ఆటగాళ్ల నుండి అంతగా సహకారం లభించలేదు. షబీర్ 4, ఆనంద్ 4, అజిత్ 3,  మంజిత్ చిల్లర్ 3  పాయింట్లు మాత్రమే సాధించారు.

వారియర్స్ జట్టు సమిష్టిగా రాణించి 35 పాయింట్లతో ఆధిక్యాన్ని సాధించింది.  దీంతో 35-26 పాయింట్ల తేడాతో తమిళ్ వారియర్స్ కు ఓటమి తప్పలేదు.