Michael Jordan: ఎన్బీఏ సూపర్ స్టార్ మైకెల్ జోర్డాన్ షూ వేలం.. 11 కోట్ల రికార్డు ధర పలికిన స్నీకర్స్..
Michael Jordan Sneakers auction: అమెరికాలో ప్రఖ్యాతిగాంచిన నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (NBA) చూసేవాళ్లకు ఆయన పరిచయం అక్కర్లేని పేరు. 80, 90 వ దశకంలో తన ఆటతో జోర్డాన్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించారు.
బాస్కెట్ బాల్ (Basket Ball) ఆట పరిచయమున్నవాళ్లకు మైకెల్ జోర్డాన్(Micheal jordan) పేరు తెలిసే ఉంటుంది. అమెరికాలో ప్రఖ్యాతిగాంచిన నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (ఎన్బీఎ-NBA) చూసేవాళ్లకు ఆయన పరిచయం అక్కర్లేని పేరు. 80, 90 వ దశకంలో తన ఆటతో ప్రపంచాన్ని ఉర్రూతలిగించిన జోర్డాన్..ఆ తర్వాత వ్యాపారవేత్తగానూ రాణిస్తున్నారు.
తాజాగా ఈ బాస్కెట్ బాల్ లెజెండ్ మళ్లీ వార్తల్లో నిలిచాడు. తన కెరీర్ ప్రారంభంలో ఉపయోగించిన జత స్నీకర్లను (Micheal jordan sneakers) వేలం వేశారు. ఆదివారం ఈ ప్రక్రియ జరిగింది. కాగా.. జోర్డాన్ ధరించిన ఈ షూ.. వేలంలో 1.5 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీ ప్రకారం.. రూ. 11,26,13,250) కు అమ్ముడుపోయాయి.
నైకీ సంస్థకు చెందిన ఈ లెదర్ షూ.. బాటమ్ ఎరుపురంగులో, పైన వైట్ కలర్ లో ఉంటాయి. 1980వ దశకంలో జోర్డాన్ వీటిని వాడినా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. నైకీతో బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సమయంలో జోర్డాన్.. వీటిని ధరించేవాడట.
ఇదిలాఉండగా.. తాజా వేలంలో వచ్చిన ధర.. గతేడాది ఆగస్టులో క్రిస్టీస్ వేలంలో భాగంగా విక్రయించబడిన ఆరు లక్షల పదిహేను వేల డాలర్ల రికార్డును అధిగమించింది. కానీ ఇవి పది లక్షల డాలర్లకు అమ్ముడుపోయాయి. ఇదిలాఉండగా.. జోర్డాన్ షూ లపై అతడి ఆటోగ్రాఫ్ కూడా ఉంది. 13 వ నెంబర్ గల ఈ షూలను అతడు 1984-85 సీజన్ లో డెన్వర్ నగ్గెట్స్ కోసం బాల్ బాయ్ గా ఉన్న టామీ టిమ్ లూయిస్ కు బహుమతిగా అందించాడు.