ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం తాను ఓపెనర్ గా దిగాలని అనుకుంటున్నట్లు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. మంగళవారం రోహిత్..తమ టీం మెంటార్ జహీర్ ఖాన్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ..గత ఐపీఎల్ మ్యాచ్ లో తాను ఏ స్థానంలోనూ కుదురుకోలేదని చెప్పారు.

అందుకే ఈఐపీఎల్ లో ఓపెనర్ గా మారుతున్నట్లు చెప్పారు. అనంతరం యువరాజ్ సింగ్ ని ముంబయి ఇండియన్స్ జట్టులోకి తీసుకోవడం విషయంపై కూడా స్పందించాడు. యువీ వల్ల మిడిల్ ఆర్డర్ బలంగా మారిందని రోహిత్ చెప్పారు.

గత మూడు నాలుగు ఐపీఎల్ మ్యాచ్ లలో తన ప్రతిభ కనిపించని యూవీ.. ఈసారి మాత్రం కచ్చితంగా తమ టీంలో కీలక ఆటగాడుగా మారతాడని యూవీ ఆశాభావం వ్యక్తం చేశారు. ముంబయి ఇండియన్స్ కి యూవీ అదనపు బలమని చెప్పారు.