ఐపీఎల్-2019 వేలం జైపూర్ లో కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఫ్రాంఛైజీలు కొంత మంది క్రికెటర్లను వేలంపాటలో దక్కించుకున్నారు. కాగా.. ఇప్పటి వరకు జరిగిన వేలంలో అందరి కన్నా ఎక్కువగా జయదేవ్ ఉనద్కత్ ఎక్కువ ధర పలికాడు. జయదేవ్ ఉనద్కత్ కోసం రాజస్థాన్, డిల్లీ జట్లు పోటీ పడ్డాయి. చివరకు అతడిని 8.40 కోట్ల భారీ ధరకు రాజస్థాన్ జట్టు అతన్ని కైవసం చేసుకుంది. 

గత సీజన్‌లో రూ.11.5కోట్లకు రాజస్థాన్ రాయల్స్ సొంతమైన ఉనద్కత్ ఈసారి రూ.1.5 కోట్ల కనీస ధరతో వేలానికి వచ్చాడు. లెఫ్టార్మ్ పేసర్ కోసం రాజస్థాన్, ఢిల్లీ పోటీ పడ్డాయి. మధ్యలో రూ.5కోట్ల బిడ్‌తో చెన్నై కూడా పోటీలోకి వచ్చింది. చివరికి రూ.8.4కోట్లకు మళ్లీ రాజస్థాన్ దక్కించుకుంది. ఇప్పటి ఈవేలంలో భారత్ నుంచి అత్యధిక ధర పలికింది ఉనద్కత్ కావడం విశేషం.

ఆ తర్వాత ఎక్కువ ధర పలికిన వారిలో అక్షర్ పటేల్ రూ.5కోట్లు పలకగా.. బ్రాత్ వైట్ కూడా రూ.5కోట్లు పలికాడు. కనీస ధర రూ.1కోటితో వేలంలో పాల్గొన్న అక్షర్ ని ఢిల్లీ క్యాపిటల్స్ రూ.5కోట్లకు దక్కించుకుంది. ఇక మరో ఆల్ రౌండర్ బ్రాత్ వైట్ రూ.75లక్షల తో కనీస వేలంలో నిలవగా.. అతనిని కోల్ కతా రూ.5కోట్లకు దక్కించుకుంది.