Paris Olympics 2024 : మను భాకర్-సరబ్‌జ్యోత్‌ సింగ్ జోడీతో ప్ర‌ధాని మోడీ ఫోన్ కాల్..

Paris Olympics 2024 :  పారిస్ ఒలింపిక్స్‌లో మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో మను భాకర్, సరబ్జోత్ సింగ్ జోడీ కాంస్య ప‌త‌కం సాధించింది. పారిస్ ఒలింపిక్స్ లో భార‌త్ కు ఇది రెండో మెడ‌ల్.
 

How PM Narendra Modi reacted as Manu Bhaker-Sarabjot Singh pair wins 2nd bronze for India at Paris Olympics 2024 RMA

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ 2024 లో భార‌త్ రెండో మెడ‌ల్ సాధించింది. మ‌ళ్లీ షూటింగ్ విభాగంలోనే ఇండియ‌కు కాంస్య ప‌త‌కం ద‌క్కింది. మంగళవారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో మను భాకర్-సరబ్జోత్ సింగ్ కాంస్యం సాధించారు. మ‌ను భాక‌ర్ ఈ ఒకే ఒలింపిక్స్ లో రెండు మెడ‌ల్స్ సాధించిన భారత క్రీడాకారిణిగా స‌రికొత్త రికార్డు సృష్టించారు. ఈ క్ర‌మంలోనే మ‌ను భాక‌ర్-సరబ్‌జ్యోత్‌ సింగ్ జోడీకి అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. వీరి ప్ర‌ద‌ర్శ‌న ప‌ట్ల యావ‌త్ భార‌తావ‌ని సంతోషం వ్యక్తం చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఫోన్ చేసి ఈ ఒలింపిక్ మెడ‌ల్ విన్న‌ర్ జోడీకి అభినందనలు తెలిపారు. ఇదివ‌ర‌కు మెడ‌ల్ గెలిచిన మ‌ను భాక‌ర్ తో ప్ర‌ధాని మోడీ స్వ‌యంగా ఫోన్ లో మాట్లాడి అభినంద‌న‌లు తెలిపారు. ఇప్పుడు ఒలింపిక్ మెడ‌ల్ గెలిచిన సరబ్‌జ్యోత్‌ సింగ్ తో కూడా ప్ర‌ధాని ఫోన్ లో మాట్లాడారు. అలాగే, ఎక్స్-హ్యాండిల్ లో ఈ జోడీకి అభినంద‌న‌లు తెలిపారు.

స్వాతంత్య్రం తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన ఏకైక భారతీయ అథ్లెట్ గా మ‌ను భాక‌ర్ చ‌రిత్ర సృష్టించారు.మరోవైపు సరబ్‌జోత్ సింగ్ త‌న తొలి ఒలింపిక్స్‌ పతకాన్ని సాధించాడు. మను-సరబ్జోత్ జోడీ 16-10తో దక్షిణ కొరియాను ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ విజయం తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ సోష‌ల్ మీడియా వేదిక‌గా.. "దేశంలోని షూటర్లు మనల్ని గర్వపడేలా చేస్తూనే ఉన్నారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో కాంస్యం సాధించిన మను భాకర్, సరబ్జోత్ సింగ్‌లకు అభినందనలు. వారిద్దరూ తమ అత్యుత్తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. జట్టు ఐక్యతకు అంతిమ ఉదాహరణగా నిలిచారు. ఈ రోజు దేశం మొత్తం చాలా సంతోషంగా ఉందని" పేర్కొన్నారు.

అంత‌ర్జాతీయ క్రికెట్ లో ఒకే ఒక్క‌డు.. య‌శ‌స్వి జైస్వాల్ మ‌రో రికార్డు

 

 

 

PARIS OLYMPICS 2024 : స్వాతంత్య్ర భార‌తంలో ఒకే ఒక్క అథ్లెట్.. మ‌ను భాక‌ర్ స‌రికొత్త రికార్డు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios