తెలుగు తేజం పివి సింధు ఒలింపిక్ పతకాన్ని సాధించినప్పుడే భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక తాజాగా బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ లో విజేతగా నిలిచి దాన్ని మరింత పెంచుకుంది. ఇలా సింధు కేవలం మంచి క్రీడాకారిణి అన్న పేరు, అభిమానులను, ప్రశంసలను పొందడమే కాదు అదేస్థాయిలో ఆదాయాన్ని కూడా పొందుతోంది. వరల్డ్ ఛాంపియన్ గా మారిన తర్వాత ఆమె ఆదాయం రెట్టింపయినట్లు  సమాచారం. ఇలా ఆమె కేవలం యాడ్స్, ప్రచార కార్యక్రమాల రూపంలో పొందే ఆదాయాన్ని చూస్తే కళ్లుబైర్లుకమ్మాల్సిందే. 

బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో సింధు గోల్డ్ మెడల్ సాధించారు. దీంతో ఒక్కసారిగా ఆమె పేరు మారుమోగిపోయింది. కేవలం భారత్ లోనే  కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఆమెకు అభిమానులు ఏర్పడ్డారు. ఒలింపిక్ పతక విజేతగానే సింధు క్రికెటర్ల స్థాయిలో ఆదాయాన్ని పొందుతుండగా తాజాగా విజయంతో అది రెట్టింపయినట్లు సమాచారం. సింధు  కేవలం యాడ్స్ రూపంలో పొందే ఆదాయం  50 నుండి 70 శాతం పెరిగినట్లు ఓ సంస్థ వెల్లడించింది. 

సదరు సంస్థ అంచనాప్రకారం ప్రస్తుతం పివి సింధు ఒక్క యాడ్ కే రోజుకు 65-85 లక్షలు పొందుతోందట. అలా కొన్ని ఉత్పత్తుల ప్రచారానికి సింధు రెమ్యునరేషన్  రూ.1.50 కోట్లుగా కూడా వుందట. ఇలా స్పోర్ట్స్ కు సంబంధించిన ఉత్పత్తుల ప్రచారంతో పాటు వివిధ రకాల యాడ్స్ ద్వారా సింధు భారీ ఆదాయాన్ని పొందుతున్నట్లు సదరు సంస్థ వెల్లడించింది. 

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వార్షికాదాయం కలిగిన మహిళా క్రీడాకారుల జాబితాను పోర్బ్స్ ఇటీవల విడుదల చేసింది. 2018-19 సంవత్సరంలో వివిధ మార్గాల ద్వారా  క్రీడాకారిణులకు వచ్చిన ఆదాయం ఆదారంగా ర్యాకింగ్స్ ఇచ్చారు. ఇందులో భారత్ నుండి కేవలం పివి సింధు ఒక్కరే టాప్ 15 లో చోటుదక్కించుకున్నారు. ఆమె 5.5 మిలియన్ డాలర్లతో 13వ స్థానంలో నిలిచింది. అయితే ఇది సింధు వరల్డ్ ఛాంపియన్ గా మారకముందు మాట. బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ విజేతగా నిలిచిన ఆమె ఆదాయం దాదాపు రెట్టింపయ్యింది. 

సంబంధిత వార్తలు 

ఏకైక క్రీడాకారిణి... పోర్బ్స్ జాబితాలో తెలుగు తేజం పివి.సింధు

పెరిగిన బ్రాండ్ వాల్యూ... కోహ్లీ తర్వాత సింధూనే

చరిత్ర సృష్టించిన పీవి సింధు...వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో ఘన విజయం

2017 ఓటమి... ఒకుహురాపై ప్రతీకారం తీర్చుకున్న సింధు

తెలుగు తేజం పివి సింధును అభినందించిన ప్రధాని, రాష్ట్రపతి

సింధుకి బంగారు పతకం... ఎమ్మెస్కే అభినందనలు