Asianet News TeluguAsianet News Telugu

పెరిగిన బ్రాండ్ వాల్యూ... కోహ్లీ తర్వాత సింధూనే

 అటు క్రీడలోనే కాకుండా.. ఇటు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిన పీవీ సింధు ‘బ్రాండ్‌ వాల్యూ’ ఇప్పుడు మరింత పెరిగింది. ఫోర్బ్స్‌ లిస్ట్‌ ప్రకారం ఆమె ప్రపంచంలోనే 7వ స్థానంలో నిలిచింది.

PV Sindhu's earnings to skyrocket after BWF win. Check out her net worth, endorsements
Author
Hyderabad, First Published Aug 28, 2019, 11:59 AM IST

ప్రపంచ బ్యాడ్మింటన్ లో స్వర్ణం సాధించిన భారత క్రీడాకారిణి పీవీ సింధూ.  ప్రపంచానికి తన పేరును పరిచయం చేయడమే కాకుండా.. దేశ గౌరవాన్ని పెంచింది. ఈ ఛాంపియన్ షిప్ ని గెలిచిన తర్వాత  సింధు బ్రాండ్ విలువ మరింత పెరిగింది. అటు క్రీడలోనే కాకుండా.. ఇటు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిన పీవీ సింధు ‘బ్రాండ్‌ వాల్యూ’ ఇప్పుడు మరింత పెరిగింది. ఫోర్బ్స్‌ లిస్ట్‌ ప్రకారం ఆమె ప్రపంచంలోనే 7వ స్థానంలో నిలిచింది.

ఫోర్డ్స్ లిస్టును ఓ సారి పరిశీలిస్తే.. క్రీడారంగంలో ఎక్కువగా ఆర్జించేంది దాదాపు క్రికెటర్లే ఉంటారు. గతంలో సచిన్ టెండుల్కర్, ధోనీలు అత్యధికంగా ఆర్జించి టాప్ ప్లేస్ లో ఉన్నారు. ఇప్పుడు టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాప్ లో ఉన్నారు. విరాట్‌ కోహ్లీ తను బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థల నుంచి రోజు వారి ఆదాయం రూ.2 కోట్లు సంపాదిస్తున్నాడు. దేశంలో కోహ్లీనే అగ్రస్థానంలో ఉండటం విశేషం. ఇప్పుడు ఆయన తర్వాత స్థానంలో రోజుకు దాదాపు  రూ.1.50 కోటి తీసుకుంటూ ద్వితీయ స్థానంలో నిలిచింది సింధు. 

సింధూ బ్రాండ్స్ ఇవే...

చైనాకు చెందిన ‘లీ నీన్గ్‌’(స్పోర్ట్స్‌ మెటీరియల్‌) సంస్థతో పీవీ.సింధు రూ.50 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. మన దేశంలో ఆ సంస్థకు చెందిన ప్రకటనలు అన్నింటిలో పీవీ సింధునే కనిపించనుంది. ఈ కాంట్రాక్ట్‌ను ఆ సంస్థతో 2023 వరకు కుదుర్చుకోవడం జరిగింది. 

దీంతో పాటు ప్రముఖ ఆన్‌లైన్‌ షాపింగ్‌ ‘మింత్రా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, జీఎస్‌టీ, జేబీఎల్‌ ఇయర్‌ఫోన్స్, బ్రిడ్జ్‌స్టోన్‌ టైర్స్, మూవ్‌ పెయిన్‌ రిలీఫ్‌ అయింట్‌మెంట్, స్పోర్ట్స్‌ ఎనర్జీ డ్రింక్‌ గట్రోడ్, వైజాగ్‌ స్టీల్స్, సెంట్రల్‌ రిజర్వ్‌ సెక్యూరిటీ ఫోర్స్, శామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్, హర్మన్‌ ఇంటర్నేషనల్‌ ఫర్‌ జీబీఎల్‌ ఎండూరెన్స్‌ ఇయర్‌ఫోన్స్, పానసోనిక్‌ బ్యాటరీస్, ఎపిస్‌ హనీ, ఓజాస్విత (శ్రీశ్రీ ఆయుర్వేద), యోనెక్స్, స్ట్రేఫీ, ఫ్లిప్‌కార్ట్, బూస్ట్‌’ వంటి ప్రముఖ బ్రాండ్‌లకు సింధు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు.

మీరు గమనించినట్లయితే... చాలా యాడ్స్ లో కనిపించే సింధు... కూల్ డ్రింక్స్ యాడ్ లో మాత్రం ఎప్పుడూ కనిపించలేదు. ఎందుకంటే స్వతహాగా ఆమె కూల్ డ్రింక్స్ కి దూరం. అందుకే వాటికి దూరంగా ఉంటుంది. ఆ కంపెనీలు కోట్లు ఆఫర్ చేసినా కూడా సింధు రిజెక్ట్ చేసినట్లు సమాచారం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios