న్యూజిలాండ్‌తో నేపియర్‌లో జరిగిన తొలి వన్డేలో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తొలి పది ఓవర్లలోనే ఓపెనర్లను పెవిలియన్ చేర్చడంతో కివీస్ కోలుకోలేకపోయింది. దీంతో అతనిపై క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తాజాగా ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు, వ్యాఖ్యాత హర్షా భోగ్లే సైతం షమీని ఆశాకానికెత్తేశాడు. టీమిండియా మోస్ట్ సక్సెస్‌ఫుల్ బౌలర్లలో షమీ ఒకడని భోగ్లే కొనియాడారు. తొలి వన్డేలో ప్రదర్శన ద్వారా వరల్డ్‌కప్ టీమ్‌లో ప్లేస్ కన్ఫర్మ్ చేసుకున్నాడన్నాడు.

ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని భారత్ చాలా రోజుల నుంచి పలువురు పేసర్లను పరీక్షిస్తూ వచ్చింది. భువనేశ్వర్ కుమార్, బుమ్రాలకు తోడుగా షమీ ఫాంలోకి రావడం ఇప్పుడు భారత్‌కు శుభపరిణామం. అయితే అతనిపై ఎక్కువ వర్క్‌లోడ్ పడకుండా టీమ్ మేనేజ్‌మెంట్ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు.

కివీస్ తో వన్డే, టీ20 సిరీస్ లు: కోహ్లీ ఔట్, రోహిత్ కు సారథ్యం

‘‘ఏయ్ నల్లోడా.. మీ అమ్మ’’ అంటూ పాక్ కెప్టెన్ వివాదాస్పద వ్యాఖ్యలు

గెలుపు సంబరాలు... మైదానంలో సరికొత్త వాహనంపై కోహ్లీ, ధోని చక్కర్లు (వీడియో)

క్రికెట్ కి గుడ్ బై చెప్పిన మాజీ ఆల్ రౌండర్

కోహ్లీ నాతో విబేధించాడు: చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే

టాప్ టెన్‌లో చేరిన కోహ్లీ...క్రికెట్ దిగ్గజం లారాను వెనక్కినెట్టి

మహిళలు సైతం.. న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం