న్యూజిలాండ్ జట్టుపై వారి స్వదేశంలోనే మొదలైన ఐదు వన్డేల సీరిస్‌‌ను భారత్ ఘనంగా ఆరంభించింది. ఇవాళ నేపియర్‌లో జరిగిన మొదటి వన్డేలో అన్ని విభాగాల్లో రాషించి భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయం భారత ఆటగాళ్లలో మరింత ఆత్మవిశ్వాసం నింపింది. దీంతో ఆటగాళ్లు ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత వైదానంలో గెలుపు సంబరాలను విచిత్రంగా చేసుకున్నారు. 

 భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ ధోనీలు మ్యాచ్ తర్వాత మైదానంలో సరదాగా గడిపిన వీడియోను బిసిసిఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. వీరిద్దరు టూ వీల్స్ సెల్ప్ బ్యాలెన్స్ కార్ పై గ్రౌండ్ లో చక్కర్లు కొట్టారు. మొదట వాహన ప్రియుడైన ధోని ఈ రైడింగ్ మొదలుపెట్టగా ఆ తర్వాత కోహ్లీ దానిపై చక్కర్లు కొట్టాడు. అయితే ధోని కాన్పిడెంట్ గా ఆ వాహనాన్ని హ్యాండిల్ చేయగా...కోహ్లీ మాత్రం కాస్త తడబడుతూనే రైడ్ పూర్తి చేశాడు. ఇలా గెలుపు ఆనందంలో ఆటగాళ్లు మైదానంలోనే కాస్సేపు సరదాగా గడిపారు.    

నేపియర్ వన్డేలో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండు విబాగాల్లోనూ రాణించిన భారత జట్టు తన విజయాల పరంపరను కొనసాగింది.  ఈ వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన  న్యూజిలాండ్ జట్టు భారత్ బౌలర్ల దాటికి తట్టుకోలేకపోయింది. దీంతో కేవలం 38 ఓవర్లలో 157 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయ్యింది. ఈ క్రమంలో బ్యాటింగ్ దిగిన భారత జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్(75 నాటౌట్), కెప్టెన్ కోహ్లీ(45) రాణించడంతో కేవలం 34 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించి ఘన విజయం సాధించింది.

వీడియో