భారత మహిళా జట్ట కోచ్ పదవి కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం హెర్షెల్ గిబ్స్ దరఖాస్తు చేశాడు. ప్రస్తుతం కోచ్‌గా వున్న రమేశ్ పొవార్ పదవీకాలం ముగియడంతో బీసీసీఐ కోచ్ పదవి కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.

దీనిపై చాలా మంది మాజీ దేశ, విదేశీ క్రికెటర్లు ఆసక్తి కనబరిచారు. డేవ్ వాట్‌మోర్, వెంకటేశ్ ప్రసాద్, టామ్ మూడీలు ఇప్పటికే కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరందరితో పోటి పడి గిబ్స్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. గిబ్స్ దక్షిణాఫ్రికా తరపున 90 టెస్టులు ఆడి 6,167 పరుగులు, 248 వన్డేల్లో 8,094 పరుగులు చేశాడు.

అతడు ఇటీవల కువైట్ జట్టు కోచ్‌గా అవతారం ఎత్తాడు. తన సూచనలు, సలహాలతో ఆ జట్టును బాగా రాటు దేల్చి 2020లో జరగునున్న టీ20 ప్రపంచకప్‌కు కువైట్ అర్హత సాధించడంలో కీలకభూమిక పోషించాడు. ఈ మధ్య ముగిసిన అఫ్గానిస్థాన్ ప్రీమియర్ లీగ్‌లో బాఖ్ లెజెండ్స్ జట్టుకు గిబ్స్ ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. తనను బీసీసీఐ ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తుందని గిబ్స్ గట్టి నమ్మకంతో ఉన్నాడట.
 

మిథాలీ ఎఫెక్ట్: రమేశ్ పొవార్‌పై వేటు..?

నాకిది చీకటి రోజు, దేశభక్తిని శంకించారు: మిథాలీ రాజ్

మిథాలీపై వేటు.. ధోనీ, కోహ్లీలను ఇలా చేసే దమ్ముందా..?

చెత్త స్ట్రైక్ రేట్: మిథాలీపై రమేష్ పొవార్ తీవ్ర వ్యాఖ్యలు

అవమానించాడు: రమేష్ పొవార్ పై బిసిసిఐకి మిథాలీ లేఖ

మిథాలీని ఎందుకు తప్పించావ్... హర్మన్ ప్రీత్‌పై బీసీసీఐ ఆగ్రహం

పరుగుల రాణి: మిథాలీరాజ్ డ్రాప్ వెనక ఆయనే...