Anju Bobby George: అంజూ బాజీ జార్జీకి అరుదైన గౌరవం.. ఘనంగా సత్కరించిన వరల్డ్ అథ్లెటిక్స్
Anju Bobby George: లాంగ్ జంప్ లో భారత కీర్తి పతాకాలను రెపరెపలాడించిన అంజూ.. రిటైరైన తర్వాత అమ్మాయిల కోసం శిక్షణా సంస్థను నెలకొల్పి వారికి ట్రైనింగ్ ఇస్తున్నది. భారత్ లో క్రీడల అభ్యున్నతి కోసం ఆమె చేస్తున్న కృషితో పాటు యువతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నందుకు గాను అంజూకు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది.
భారత మాజీ మహిళా అథ్లెట్ అంజూ బాబీ జార్జీకి అరుదైన గౌరవం దక్కింది. అథ్లెట్ విభాగంలో ఆమె చేసిన సేవలకు గాను వరల్డ్ అథ్లెటిక్స్.. 2021 ఏడాదికి ఆమెను ‘ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో సత్కరించింది. లాంగ్ జంప్ లో భారత కీర్తి పతాకాలను రెపరెపలాడించిన అంజూ.. రిటైరైన తర్వాత అమ్మాయిల కోసం శిక్షణా సంస్థను నెలకొల్పి వారికి ట్రైనింగ్ ఇస్తున్నది. ఈ నేపథ్యంలో వరల్డ్ అథ్లెటిక్స్.. ఆమెను ఉమెన్ ఆఫ్ ది ఇయర్ తో సత్కరించడం గమనార్హం.
బుధవారం ట్విట్టర్ వేదికగా స్పందించిన వరల్డ్ అథ్లెటిక్స్.. ‘ఈ ఏడాది ఉమెన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైన అంజూ బాబీ జార్జీకి అభినందనలు. భారత్ లో క్రీడల అభ్యున్నతి కోసం ఆమె చేస్తున్న కృషితో పాటు యువతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నందుకు గాను ఈ అవార్డుకు ఆమె అర్హురాలు..’ అని పేర్కొంది.
ఇది కూడా చదవండి : Peng Shuai: చైనాకు భారీ షాక్.. అన్ని టోర్నీలకు స్వస్థి.. ఆమె కనిపించేదాకా అంతేనన్న డబ్ల్యూటీఏ
కాగా మహిళల విభాగంలో అంజూ కు ఈ అవార్డు దక్కగా.. పురుషుల విభాగంలో జమైకా ఒలింపియన్ ఎలైన్ థాంప్సన్, నార్వే క్రీడాకారుడు కార్స్టెన్ వార్లోమ్ లు ‘వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కించుకున్నారు.
1977లో కేరళలో జన్మించిన అంజూ బాబీ జార్జీ.. 2003 లో పారిస్ లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లో భాగంగా లాంగ్ జంప్ ఈవెంట్ లో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించింది. అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్స్ లాంగ్ జంప్ లో పతకం సాధించిన తొలి అథ్లెట్ గా చరిత్రకెక్కింది. ఆ ఈవెంట్ లో అంజూ.. 6.70 మీటర్లు దూకింది. ఇక 2005లో జరిగిన IAAF World Athletics లో ఆమె ఏకంగా స్వర్ణ పతకం సాధించడం గమనార్హం. అంతేగాక 2005 ఇంచియాన్, 2007 అమ్మన్ ఏషియన్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం, రజతం నెగ్గింది.
అథ్లెటిక్స్ లో ఆమె చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం.. ఆమెకు 2003లో అర్జున అవార్డు, 2004లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న దక్కగా 2004లో పద్మశ్రీ వచ్చింది.