టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ మైదానంలో మంచి వ్యూహకర్త అని తెలిసిందే. ఒత్తిడిలో సైతం ఎత్తులు వేయడం, వాటిని కూల్‌గా అమలు పరచడం ధోనీ స్ట్రాటజీ. అన్నింటికన్నా ముఖ్యంగా అతని కీపింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

ఎవరైనా క్రీజు వదిలి షాట్‌కు ప్రయత్నించారో రెప్పపాటులో బేల్స్ గాల్లోకి లేస్తాయి. తాజాగా ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్‌లో జరిగిన ఆఖరి వన్డేలో ధోనీ కీపింగ్‌లో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు.

భారత బౌలర్లను ప్రతిఘటించి న్యూజిలాండ్‌ను విజయం వైపు తీసుకెళ్లిన జేమ్స్ నీషమ్ ఒక పరుగు కోసం ప్రయత్నించాడు. కీపింగ్‌లో ఉన్న ఎంఎస్ ధోని బంతిని వేగంగా వికెట్ల మీదకు తోశాడు.

ఏం జరిగిందో తెలుసుకునే లోపు నీషమ్ ఔటయ్యాడు. ఈ రనౌటే మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేందుకు దోహదం చేసింది. దీనికి సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ రనౌట్‌ను ఉద్దేశిస్తూ ఓ అభిమాని చేసిన ట్వీట్‌కు ఐసీసీ స్పందించింది. ’’ధోనీ వికెట్ల వెనుక కీపింగ్‌‌లో ఉండగా క్రీజును వదిలి ఆడొద్దంటూ’’ ఆటగాళ్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. 

తొలుత బ్యాటింగ్: అసలు విషయం చెప్పిన రోహిత్ శర్మ

కోహ్లీ స్థానం తనకివ్వాలని కోరుతున్నచాహల్

టీంఇండియా నోట పాపులర్ సినిమా డైలాగ్.. బీసీసీఐ ట్వీట్

ఒంటరినై పోయాను: భార్యను ఉద్దేశిస్తూ రోహిత్ సంచలన వ్యాఖ్యలు

స్పిన్నర్ కేదార్ జాదవ్ కు షాకిచ్చిన ధోనీ

తప్పిదం: పరుగు కోల్పోయిన హార్దిక్ పాండ్యా

భారత బ్యాట్స్‌మెన్ ఎందుకు విఫలమవుతున్నారంటే..!!