టీమిండియా వైఎస్ కెప్టెన్ రోహిత్ శర్మ తన భార్య రితికను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్‌లో జరిగిన చివరి వన్డేలో భారత్ .. న్యూజిలాండ్‌పై 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

మ్యాచ్ అనంతరం వెల్లింగ్టన్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో షాపింగ్ వెళ్లిన హిట్ మ్యాన్... తన వెంట భార్య లేకుండా షాపింగ్ చేయడం మనసులో ఏదో కోల్పోయినట్లుగా ఉందంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

తాను షాపింగ్ చేస్తున్న ఫోటోను దానిలో జత చేశాడు. అలాగే తన భార్యను మిస్ అవ్వడానికి కారణాలు ఉన్నాయన్నాడు. మరోవైపు భర్త వ్యాఖ్యలపై రోహిత్ సతీమణి రితికా స్పందింస్తూ.. ‘‘ఆహా’’ అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ భార్యాభర్తల పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Supermarket shopping without the wife is a disaster, one of the many reason I miss her

A post shared by Rohit Sharma (@rohitsharma45) on Feb 1, 2019 at 3:52am PST