న్యూజిలాండ్ గడ్డపై చిరస్మరణీయ విజయాన్ని టీం ఇండియా సొంతం చేసుకుంది.  దశాబ్దాల నాటి కలను టీం ఇండియా నెరవేర్చింది. న్యూజిలాండ్ గడ్డపై ఆ దేశ జట్టుతో ఇటీవల జరిగిన వన్డే సిరీస్ ని టీం ఇండియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆదివారం కప్ ని అందుకున్నారు.

కాగా.. ఆ సమయంలో టీం ఇండియా నోటి నుంచి పాపులర్ సినిమా డైలాగ్ ఒకటి బయటకు వచ్చింది. కాగా.. ఆ వీడియోకి సంబంధించిన ట్వీట్ ని బీసీసీఐ ట్విట్టర్ లో పోస్టు చేసింది.కప్ అందుకున్న తర్వాత ఫొటోలకు ఫోజిస్తున్న సందర్భంలో కేదార్ జాదవ్ హౌ ద జోష్ అంటూ గట్టిగా అరిచాడు. దీనికి సహచర క్రికెటర్లు అదే స్థాయిలో హై సార్ అని అనడంతో స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లింది. 

పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో బాలీవుడ్‌లో ఇటీవలే విడుదలైన యురీ- ద సర్జికల్ స్ట్రైక్ సినిమాలోని హౌ ద జోష్ డైలాగ్ ఈమధ్య కాలంలో బాగా పాపులర్ అయ్యింది. సినిమాలో కీలక పాత్ర పోషించిన విక్కీ కౌశల్..ఈ డైలాగ్‌తో జవాన్లలో స్ఫూర్తి రగిలిస్తూ ముందుకు సాగడం ప్రేక్షకులను కట్టిపడేసింది. జాదవ్ డైలాగ్ వీడియోను బీసీసీఐ తమ అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. జట్టులో జోష్ బాగుందంటూ ఫొటో క్యాప్షన్‌తో వీడియోను ట్వీట్ పోస్ట్ చేసింది.