Asianet News TeluguAsianet News Telugu

హిజ్రాగా మారిన టీంఇండియా సీనియర్ ప్లేయర్

సామాజిక సమస్యలు, అసమానతలపై గళమెత్తడంలో టీంఇండియా సీనియర్ ఆటగాడు గౌతమ్ గంబీర్ ఎప్పుడూ ముందుంటాడు. గతంలో కాశ్మీర్ పై వివాదాస్పదంగా మాట్లాడిన
షాహిద్ అప్రిదిపై గంభీర్ విరుచుకుపడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సుప్రీం కోర్టు ట్రాన్స్ జెండర్స్ హక్కులపై ఇచ్చిన తీర్పుపై స్పందించారు. స్పందించడమే కాదు...వారి వేషధారణలో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.

Cricketer Gautam Gambhir wears dupatta and bindi to support transgenders
Author
Delhi, First Published Sep 14, 2018, 7:31 PM IST

 సామాజిక సమస్యలు, అసమానతలపై గళమెత్తడంలో టీంఇండియా సీనియర్ ఆటగాడు గౌతమ్ గంబీర్ ఎప్పుడూ ముందుంటాడు. గతంలో కాశ్మీర్ పై వివాదాస్పదంగా మాట్లాడిన
షాహిద్ అప్రిదిపై గంభీర్ విరుచుకుపడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సుప్రీం కోర్టు ట్రాన్స్ జెండర్స్ హక్కులపై ఇచ్చిన తీర్పుపై స్పందించారు. స్పందించడమే కాదు...వారి వేషధారణలో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.

ట్రాన్ జెండర్స్ ఇదివరకే అండగా నిలుస్తూ వారితో గంభీర్ రాఖీ కట్టించుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో సారి వారిపై సమాజంలో వున్న చెడు అభిప్రాయాన్ని తుడిచేయడానికి ప్రయత్నించారు. డిల్లీ మాల్ లో ట్రాన్స్ జెండర్స్ ఆద్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గంభీర్ వారి వేషధారణలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ వేషధారణలోనే గంభీర్ హాజరయ్యారు. తలపై దుపట్టా ధరించి నుదుట బొట్టు ధరించి కనిపించాడు గంభీర్. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. హిజ్రాలకు మద్దతుగా నిలుస్తూ గంభీర్ ఇలా వారి వేషధారణలో కనిపించడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. గంభీర్ ను ఆదర్శంగా తీసుకుని తమకు సమాజంలో తగిన గౌరవాన్ని ఇవ్వాలని హిజ్రాలు కోరుకుంటున్నారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios