బ్రెజిల్ vs మెక్సికో.. హాట్ పాయింట్స్ (వీడియో)

brazil vs mexico match highlights
Highlights

బ్రెజిల్ vs మెక్సికో.. హాట్ పాయింట్స్ 

2018  ఫిఫా వరల్డ్‌కప్ హాట్ ఫేవరెట్లలో ఒకటైన బ్రెజిల్.. తన స్ధాయికి తగ్గ ప్రదర్శనను చేసింది.. సోమవారం మెక్సికోతో జరిగిన  మ్యాచ్‌లో 2-0 తేడాతో విజయం సాధించింది. స్టార్ ఆటగాడు నెయ్‌మర్ మరోసారి మెరిశాడు.. మ్యాచ్‌కు ముందు సాధారణంగా కనిపించిన బ్రెజిల్ క్షణక్షణానికి రాటుదేలింది. గోల్ పోస్ట్‌ను లక్ష్యంగా చేసుకుని బ్రెజిల్ ఆటగాళ్లు రెచ్చిపోయారు.. 51వ నిమిషంలో నెయిమర్, 88వ నిమిషంలో ఫిర్మినో చెరో గోల్ సాధించి.. జట్టుకు విజయతీరాలకు చేర్చారు. 
ఇక ఈ మ్యాచ్‌తో నమోదైన రికార్డులు చూస్తే:

* ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ సాధించిన ఘనత బ్రెజిల్‌దే(228). ఈ మ్యాచ్‌కు ముందు జర్మనీతో సమానంగా ఉన్న బ్రెజిల్‌ రెండు గోల్స్ కొట్టి నెంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.
* ఈ టోర్నీలో బ్రెజిల్ 2-0 తేడాతో గెలవడం ఇది మూడోసారి.. 
* ఈ టోర్నీలో అత్యధిక టార్గెట్ షాట్స్ కొట్టిన  జట్టు(48)
* ఫిఫా వరల్డ్ కప్‌లలో రెండవ అర్థభాగంలో తొమ్మిది గోల్స్ కొట్టిన జట్టు.. నిన్న నేయిమర్ కొట్టిన గోల్స్‌తో బ్రెజిల్ ఈ  ఘనత సాధించింది.
* ప్రపంచకప్‌లలో 38 షాట్స్‌లలో నేయిమర్ 6 గోల్స్ కొట్టాడు.. మెస్సీ 67, రోనాల్డో 74  గోల్స్‌లతో అతని కంటే ముందున్నారు,
*  సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి  గోల్  కొట్టిన ఫిర్మినో.. 2016లో బోలివియాతో జరిగిన మ్యాచ్‌ తర్వాత కొట్టిన మొదటి గోల్.. 

"

loader