సారాంశం

ఏషియన్ గేమ్స్ 2023లో భారత్ మరో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్స్‌లో దీపికా పల్లికల్, హరిందర్ పాల్ సింగ్‌లు మెరుగైన ప్రదర్శనతో ఫైనల్స్‌లో మలేషియా ఆటగాళ్లను ఓడించారు.
 

ఏషియన్ గేమ్స్‌లో భారత్ స్వర్ణ పతకాలను వేటాడుతున్నది. భారత్ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. ఇప్పటికే 19 బంగారు పతకాలను సొంతం చేసుకున్న భారత్ తాజాగా మరో గోల్డ్‌ను ఖాతాలో వేసుకుంది. స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్స్‌లో ఇండియా గోల్డ్ మెడల్ సంపాదించుకుంది. దీపికా పల్లికల్, హరిందర్‌పాల్ సింగ్ జోరు కనబరిచారు. దూకుడుగా ఆడి పసిడి పతకాన్ని సాధించారు. ఫైనల్స్‌లో మలేషియాపై 2-0తో పైచేయి సాధించారు. 

Also Read: ఏషియన్ గేమ్స్ 2023: కొనసాగుతున్న భారత పతకాల జోరు.. ఆర్చరీలో మరో స్వర్ణం..

ఏషియన్ గేమ్స్ 2023 చైనాలోని హాంగ్ జౌలో జరుగుతున్నాయి. ఈ ఆసియా క్రీడల్లో భారత్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నది.

దీపికా పల్లికల్, సందులూ 35 నిమిషాల్లో మ్యాచ్ ఫినిష్ చేశారు. 11-10, 11-10 స్కోర్‌తో మలేషియా ఆటగాళ్లు ఐఫా బింతి, సైఫిక్ కమల్‌లపై పైచేయి సాధించారు. ఉభయ జట్లు ఆది నుంచి పోటా పోటీగా ఆడుకుంటూ వచ్చాయి. ఒక దశలో 6-4తో మలేషియా జట్టు ముందంజలో ఉన్నది. ఆ తర్వాత వరుసగా నాలుగు పాయింట్లు మలేసియా టీమే సాధించింది. కానీ, ఆ తర్వాత భారత టీమ్ మళ్లీ పుంజుకుంది. పల్లికల్, సంధు 8-6తో మళ్లీ లీడ్‌లోకి వచ్చారు.  

ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు ఇది రెండో పసిడి పతకం. మొత్తంగా చూసుకుంటే స్క్వాష్‌లో భారత్‌కు ఇది నాలుగో మెడల్. ఇంతకు ముందు భారత్ పురుషుల స్క్వాష్ టీమ్ పాకిస్తాన్‌ను మట్టికరిపించి గోల్డ్ సాధించుకుంది. మహిళల టీమ్ మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్య పతకం సాధించింది. అనహత్, అభయ్ సింగ్ ఈ కాంస్య పతకాన్ని సాధించారు.