KL Rahul hits century: ఇంగ్లాండ్ లయన్స్‌ తో జరిగిన రెండవ అనధికార టెస్టులో కేఎల్ రాహుల్ సెంచరీ సాధించాడు. జూన్ 20 నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లాండ్-భారత్ టెస్ట్ సిరీస్‌కు ఉత్సాహాన్నిచ్చాడు.

KL Rahul hits century: భారత క్రికెట్ జట్టుకు ఇంగ్లాండ్ పర్యటనకు ముందు భారీ ఊరట లభించింది. సీనియర్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన రెండవ అనధికార టెస్టులో అద్భుత సెంచరీని సాధించాడు. ఈ సెంచరీ బాది తన ఫామ్‌ను చూపించాడు. జూన్ 20న ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్‌కు ఇది భారత్ కు మంచి సంకేతంగా మారింది.

ఇటీవల టెస్టు జట్టులో తన స్థానం కోల్పోయిన కేఎల్ రాహుల్, గట్టి పోరాటం చేసి తనదైన ఆటతో తిరిగి ఫామ్ ను అందుకుని టెస్టు జట్టులోకి వచ్చాడు. అలాగే, తన ఆటను కూడా మెరుగుపర్చాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్‌తో ఇప్పుడు కేఎల్ రాహుల్‌కు టాప్ ఆర్డర్‌లో, ముఖ్యంగా ఓపెనింగ్ బాధ్యతలు అందుకున్నాడు. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో కలిసి రాహుల్ టెస్టుల్లో ఓపెనింగ్ చేయనున్నాడు. ఇంగ్లాండ్ పర్యటన అతనికి ముఖ్యమైన పరీక్షగా మారనుంది.

ఐపీఎల్ ముగిసిన తర్వాత, రాహుల్ స్వయంగా బీసీసీఐకి సంప్రదించి రెండవ అనధికార టెస్టులో ఆడాలన్న అభిరుచిని వ్యక్తం చేశారు. దీంతో అతన్ని జట్టులోకి తీసుకుని, ఇంగ్లాండ్ టూర్‌కు తొలి అడుగు వేశాడు. కరుణ్ నాయర్, ధ్రువ్ జురేల్‌లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నిర్మించిన రాహుల్ 116 పరుగుల సెంచరీ బాదాడు.

ఇదే మ్యాచ్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫెయిలైనా, అతని ప్రతిభను బట్టి తిరిగి రాణించే అవకాశం ఎక్కువగా ఉంది. మరోవైపు, కరుణ్ నాయర్, ధ్రువ్ జురేల్ మిడిల్ ఆర్డర్ లో మంచి ప్రదర్శన కనబరిచారు. విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయగలిగే మిడిల్ ఆర్డర్ బ్యాటర్లుగా వీరిలో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉంది.

నూతన కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా లాంటి ఆటగాళ్లు మిగిలిన మిడిల్ ఆర్డర్‌లో కీలక పాత్ర పోషించనున్నారు.

టెస్ట్ సిరీస్‌కు ముందే ఫామ్‌లోకి వచ్చిన కేఎల్ రాహుల్ ప్రదర్శన, భారత జట్టుకు స్థిరతను, నమ్మకాన్ని అందించనుంది. అతని ఫిట్‌నెస్, ఆట పట్టు, అనుభవం భారత టాప్ ఆర్డర్‌కు కీలకం కానుంది.

Scroll to load tweet…