Asianet News TeluguAsianet News Telugu

ఏషియన్ గేమ్స్ 2023: కొనసాగుతున్న భారత పతకాల జోరు.. ఆర్చరీలో మరో స్వర్ణం..

చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్-2023 భారత్‌కు పతకాల వేట కొనసాగుతుంది. తాజాగా భారత్ ఖాతాలో మరో బంగారు పతకం చేరింది.

Asian Games 2023 Indias Jyothi Vennam Aditi Swami Parneet Kaur clinch gold medal in archery ksm
Author
First Published Oct 5, 2023, 10:08 AM IST

చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్-2023 భారత్‌కు పతకాల వేట కొనసాగుతుంది. తాజాగా భారత్ ఖాతాలో మరో బంగారు పతకం చేరింది. భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు ఫైనల్లో చైనీస్ తైపీని 230-229తో ఓడించి స్వర్ణం సాధించింది. భారత ఆర్చర్లు జ్యోతి వెన్నం, అదితి స్వామి, పర్నీత్ కౌర్ ఈ గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకున్నారు. ఇది ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు 19వ స్వర్ణం. 

ఏషియన్ గేమ్స్ 2023లో భారత్ తనదైన ముద్ర వేసింది. ఏషియన్ గేమ్స్ చరిత్రలో అత్యుత్తమ పతకాలన సాధించింది. ఏషియన్ గేమ్స్-2023లో  భారత్ ఇప్పటివరకు 19 బంగారు పతకాలు, 31 రజత పతకాలు, 32 కాంస్య పతకాలతో మొత్తం 82 పతకాలు సాధించింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios