Asianet News TeluguAsianet News Telugu

ఆసియా కప్: పాక్ బౌలర్లు చిత్తు, భారత్ ఘన విజయం

ఆసియా కప్ లో భాగంగా ఆదివారం జరుగుతున్న వన్డే మ్యాచులో పాకిస్తాన్ టాస్ గెలిచి పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇమామ్ ఉల్ హక్, ఫకర్ జమాన్ బ్యాటింగ్ కు దిగారు. 

Asia cup super four: India vs Pakistan
Author
Dubai - United Arab Emirates, First Published Sep 23, 2018, 5:16 PM IST

ఆసియా కప్ లో భాగంగా ఆదివారం జరిగిన సూపర్ ఫోర్ మ్యాచులో పాకిస్తాన్ పై 9 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ సెంచరీలతో అదరగొట్టారు. పాకిస్తాన్ బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. భారత్ శిఖర్ ధావన్ వికెట్ ను రన్నవుట్ రూపంలో కోల్పోయింది. పాకిస్తాన్ తమ ముందు ఉంచిన 238 పరుగుల లక్ష్యాన్ని భారత్ 39.3 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ 111 పరుగులతో, అంబటి రాయుడు 12 పరుగులతో అజేయంగా నిలిచారు.

అంతకు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. 106 బంతుల్లో 7, ఫోర్లు, 3 సిక్స్ ల సాయంతో అతను సెంచరీ చేశాడు ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ 200 పరుగుల భాగస్యామ్యాన్ని నెలకొల్పారు. 32.5 ఓవర్లలో భారత్ స్కోర్ 204 పరుగులకు చేరుకుంది. శిఖర్ ధావన్ సెంచరీ పూర్తి చేశాడు. భారత్ 210 పరుగుల స్కోరు వద్ద శిఖర్ ధావన్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. 33.3 ఓవర్ల వద్ద శిఖర్ ధావన్ రన్నవుట్ గా పెవిలియన్ చేరుకున్నాడు. వంద బంతుల్లో అతను 114 పరుగులు చేశాడు. అందులో 16 ఫోర్లు, 2 సిక్స్ లు ఉన్నాయి.

శిఖర్ ధావన్ 56 బంతుల్లో అతను అర్థ సెంచరీ పూర్తి చేశాడు. భారత్ అప్పటికి వికెట్ నష్టపోకుండా 18 ఓవర్లలో 91 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 65 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. అప్పటికి భారత్ 22 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 119 పరుగులు చేసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ భారత్ ముందు 238 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా, చాహల్, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. పాకిస్తాన్ 211 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతూ పరుగుల వరద పారించ్ క్రమంలో అసిఫ్ అలీ 21 బంతుల్లో 30 పరుగులు చేసి చాహల్ కు దొరికిపోయాడు. మరో మూడు బంతులు మాత్రమే మిగిలి ఉన్న స్థితిలో పాకిస్తాన్ ఏడో వికెట్ కోల్పోయింది. 234 పరుగులు వద్ద షాదాబ్ బుమ్రా బౌలింగులో అవుటయ్యాడు.

ఎట్టకేలకు షోయబ్ మాలిక్ అవుటయ్యాడు. 403 పరుగుల వద్ద షోయబ్ మాలిక్ బుమ్రా బౌలింగులో ధోనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. మాలిక్ 78 పరుగులు చేశాడు. మాలిక్ అవుట్ కావడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది.పాకిస్తాన్ 165 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. వికెట్ల వద్ద పాతుకుపోయిన మాలిక్, సర్ఫారాజ్ జోడీని కుల్దీప్ యాదవ్ విడదీశాడు. 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సర్ఫారాజ్ పెవిలియన్ చేరుకున్నాడు. షోయబ్ మాలిక్ 141 పరుగుల పాకిస్తాన్ స్కోరు వద్ద అతను అర్థ సెంచరీ చేశారు. సర్ఫరాజ్, షోయబ్ మాలిక్ మరో వికెట్ పడకుండా స్కోరు పెంచడంలో కీలక పాత్ర పోషించారు..

పాకిస్తాన్ టాస్ గెలిచి పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇమామ్ ఉల్ హక్, ఫకర్ జమాన్ బ్యాటింగ్ కు దిగారు. అయితే పాకిస్తాన్ 24 పరుగుల స్కోరు వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 20 బంతుల్లో 10 పరుగులు చేసి ఇమామ్ ఉల్ హక్ చాహల్ బౌలింగులో వెనుదిరిగాడు.పాకిస్తాన్ 55 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. జమాన్ 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కుల్దీప్ యాదవ్ బౌలింగులో అవుటయ్యాడు. పాకిస్తాన్ కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. 58 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. బాబర్ 25 బంతుల్లో కేవలం 9 పరుగులు చేసి రన్నవుట్ గా పెవిలియన్ చేరుకున్నాడు.

సంబంధిత వార్తల వివరాలు

ఆసియా కప్ షెడ్యూల్...

ఆసియా కప్: పాకిస్తాన్ ను చితక్కొట్టిన ఇండియా

ఆసియా కప్ 2018 : హ్యాట్రిక్‌పై కన్నేసిన రోహిత్ సేన

ఆసియా కప్: భారీ తేడాతో బంగ్లా చేతిలో శ్రీలంక చిత్తు

ఆసియా కప్: అదరగొట్టిన అఫ్గాన్, బంగ్లా చిత్తు

ఆసియాకప్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ... మరో ఇద్దరు ఆటగాళ్లు టోర్నీకి దూరం

పాకిస్థాన్‌ మ్యాచ్‌లో గాయపడ్డ హర్దిక్ పాండ్యా... స్ట్రెచర్ పై గ్రౌండ్ బయటకు తరలింపు

భారత్, పాక్‌లలో ఎవరికి సపోర్ట్ చేస్తారన్న నెటిజన్.. ట్విట్టర్‌కు టాటా చెప్పిన సానియా

Follow Us:
Download App:
  • android
  • ios