ఆసియాకప్ లో హాంకాంగ్, పాకిస్థాన్ జట్లుపై విజయం సాధించి టీంఇండియా మంచి జోరుమీదుంది. అయితే ఈ రెండు మ్యాచుల్లో విజయాలు సాధించి భారత జట్టు పామ్ లోకి వచ్చినట్లు భావిస్తున్న సమయంలో ఆటగాళ్ల గాయాలు భయపెడుతున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ గాయం కారణంగా అతడు టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. తాజాగా మరో ఇద్దరు ఆటగాళ్లు కూడా ఈ టోర్నీ నుండి వైదొలుగుతున్నట్లు బిసిసిఐ ప్రకటించింది.

ఆసియా కప్ లో భాగంగా హాకాంగ్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో భారత బౌలర్ అక్షర్ పటేల్ చూపుడు వేలికి గాయమయింది. ఈ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో తదుపరి మ్యాచుల్లో అతడు ఆడే అవకాశం లేదు. ఇలా అతడు పూర్తిగా టోర్నీ నుండి వైదొలగుతున్నట్లు బిసిసిఐ పేర్కొంది. ఇదే మ్యాచ్ లో మరో బౌలర్ శార్దూల్ ఠాకూర్ కూడా గాయపడ్డాడు. ఇతడి తొడ కండరాలు పట్టేయడంతో ఈ టోర్నీ మొత్తానికి అతడు దూరమయ్యాడు.

ఈ ఇద్దరి స్థానంలో రవీంద్ర జడేజా, సిద్దార్థ్ కౌల్ లు టీంలోకి వచ్చారు. అలాగే పాండ్యా స్థానంలో చాహల్ ను జట్టులోకి తీసుకున్నారు. తదుపరి భారత జట్టు ఆడే మ్యాచుల్లో వీరు ఆడనున్నట్లు బిసిసిఐ తన అధికారిక వెబ్ సైట్ లో పేర్కొంది.

Scroll to load tweet…

సంబంధిత వార్తలు

తగ్గని వెన్నునొప్పి.. ఆసియాకప్ నుంచి వైదొలిగిన హార్డిక్ పాండ్యా

పాకిస్థాన్‌ మ్యాచ్‌లో గాయపడ్డ హర్దిక్ పాండ్యా... స్ట్రెచర్ పై గ్రౌండ్ బయటకు తరలింపు