భారత టెన్నిస్ స్టార్ సానియాకు అరుదైన సమస్య వచ్చింది.. ఆసియా కప్‌లో భాగంగా ఇవాళ భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా పలువురు అభిమానులు సానియాపై ప్రశ్నల వర్షం కురిపించారు
భారత టెన్నిస్ స్టార్ సానియాకు అరుదైన సమస్య వచ్చింది.. ఆసియా కప్‌లో భాగంగా ఇవాళ భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా పలువురు అభిమానులు సానియాపై ప్రశ్నల వర్షం కురిపించారు.
మీరు భారత్ గెలవాలని కోరుకుంటారా.. పాకిస్తాన్ గెలవాలని కోరుకుంటారా..? ఇద్దరిలో ఎవరికి సపోర్ట్ చేస్తారంటూ ఓ అభిమాని సానియాను ప్రశ్నించాడు. దీంతో కాస్త అయోమయానికి గురైన సానియా మీర్జా తాను కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు తెలిపారు.
మ్యాచ్ ప్రారంభం కావడానికి 24 గంటలు కూడా లేదు.. కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం మంచిది.. లేకపోతే చెత్తవాగుడు వినాల్సి వస్తుందని.. ఇలాంటి వాగుడు వింటే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కూడా జబ్బు పడతాడని.. ప్రెగ్నెంట్ అయిన నా పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు... అందువల్ల కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు ప్యాక్ చెప్పడం మంచిదని దూరంగా ఉంటున్నట్లు సానియా ట్వీట్ చేశారు.
