ఆసియా దేశాల మధ్య ఇండోనేషియాలో జరిగిన క్రీడా సమరంలో భారత్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో పతకాలను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆసియా దేశాల క్రికెట్ జట్ల మధ్య జరిగే క్రీడా సమరంలో అదే తరహా ప్రదర్శనతో దూసుకుపోడానికి టీంఇండియా సిద్దమవుతోంది. ఇటీవలే ఇంగ్లాడ్ టూర్ ను ముగించుకున్న భారత జట్టు ఈ నెల 15వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఆసియా కప్(వన్డే) కోసం యూఏఈకి పయనమైంది. 

టీంఇండియా కెప్టెన్ కోహ్లీకి విశ్రాంతినివ్వడంతో ఈ ఆసియా కప్ లో రోహిత్ సారథ్యం వహించనున్నాడు.ఈ టోర్నీ సెప్టెంబర్ 15వ తేదీ నుండి ప్రారంభమవుతుండగా టీంఇండియా 18న హాంకాంగ్ తో మొదటి మ్యాచ్ లో తలపడనుంది. ఆ తర్వాతి రోజు అంటే సెప్టెంబర్ 19 దాయాది దేశాల మధ్య ఆసక్తికరమైన మ్యాచ్ జరగనుంది. చాలా రోజుల తర్వాత చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ పోటీపడుతుండటంతో ఈ మ్యాచ్ పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మొత్తం ఆసియా కప్ లో జరిగే అన్ని మ్యాచ్ ల  కంటే ఈ మ్యాచ్ పైనే ఎక్కువ ఆసక్తి నెలకొంది. 

ఆసియా కప్ షెడ్యూల్...

సెప్టెంబర్‌ 15  శనివారం - గ్రూప్ బి -     శ్రీలంక × బంగ్లాదేశ్‌

సెప్టెంబర్‌ 16  ఆదివారం  - గ్రూప్ ఎ -   హాంకాంగ్‌ × పాకిస్థాన్‌

సెప్టెంబర్‌ 17  సోమవారం - గ్రూప్ బి -   శ్రీలంక × అఫ్గానిస్తాన్‌ 

సెప్టెంబర్‌ 18  మంగళవారం - గ్రూప్ ఎ -  భారత్‌ × హాంకాంగ్‌ 

సెప్టెంబర్‌ 19 బుధవారం - గ్రూప్ ఎ -  భారత్‌ × పాకిస్థాన్‌ 

సెప్టెంబర్‌ 20 గురువారం - గ్రూప్ బి -  బంగ్లాదేశ్‌ × అఫ్గానిస్థాన్‌ 

సెప్టెంబర్‌ 21 -  సూపర్ 4 మ్యాచ్‌ 1, 2 

సెప్టెంబర్‌ 23 -  సూపర్ 4 మ్యాచ్‌ 3, 4 

సెప్టెంబర్‌ 25 -  సూపర్ 4  4 మ్యాచ్‌ 5 

సెప్టెంబర్‌ 26 - సూపర్ 4 4 మ్యాచ్‌ 6 

సెప్టెంబర్‌ 28 - ఫైనల్‌