ఆసియా కప్ 2018 : హ్యాట్రిక్‌పై కన్నేసిన రోహిత్ సేన

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 14, Sep 2018, 5:14 PM IST
Rohit Sharma Eyes Third Series Win As Captain
Highlights

ఆసియా దేశాల మధ్య జరిగే క్రికెట్ సమరానికి టీంఇండియా సిద్దమైంది. ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో పాల్గొనేందుకు భారత జట్టు గురువారం సాయంత్ర యూఏఈకి బయల్దేరింది. అయితే ఈ టోర్నీ నుండి విరాట్ కోహ్లీ కి విశ్రాంతినివ్వడంతో హిట్ మ్యాన్ రోహిత్ టీంఇండియా పగ్గాలు చేపట్టాడు. ఇప్పటికే విజయవంతమైన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న రోహిత్...ఇక విజయవంతమైన కెప్టెన్ గా పేరుతెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఆసియా కప్ 2018 కప్ ను టీంఇండియా కు అందించి కెప్టెన్ గా నిరూపించుకోవాలని రోహిత్ ఉవ్విళ్ళూరుతున్నాడు.

ఇలా టీంఇండియా సారథ్య బాధ్యతలు చేపట్టడం రోహిత్ కి కొత్తేమీ కాదు. ఇదివరకు కూడా ఇలాగే 2017లో శ్రీలంక టూర్ సందర్భంగా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలెక్టర్లు విశ్రాంతి నివ్వడంతో రోహిత్ శర్మ మొదటిసారి భారత జట్టు సారథ్య బాధ్యతలు అందుకున్నారు. ఈ సీరీస్ లో టీంఇండియా రోహిత్ కెప్టెన్సీలో అద్బుతమైన ఆటతీరుతో వన్డే మరియు టీ20 సీరీస్ లను గెలుచుకుంది. ఇలా మొదటి సారి కెప్టెన్ గా వ్యవహరించిన రోహిత్ విదేశీ గడ్డపై టీంఇండియాకు అద్భుత విజయాన్ని అందించారు.  

ఇక వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శనలో రోహిత్ భారత జట్టులో టాప్ బ్యాట్ మెన్ గా పేరుతెచ్చుకున్నాడు. అంతే కాదు ధనా ధన్ బ్యాటింగ్ తో టీంఇండియా హిట్ మ్యాన్ మారాడు. 2007 లో భారత జట్టులో స్థానం సంపాదించిన రోహిత్ ఇప్పటివరకు వన్డేల్లో 6,748 పరుగులు సాధించారు. ఇందులో 18 సెంచరీలు, 34 హాప్ సెంచరీలున్నాయి. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా రోహిత్ క్రికెట్ చరిత్రలో నిలిచాడు. ఈ ఆసియా కప్ లో కూడా కెప్టెన్ గా రోహిత్ రికార్డుల మోత మోగించాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.
 
సంబంధిత వార్తలు

ఆసియా కప్ షెడ్యూల్... భారత్-పాకిస్థాన్ పోరు ఎప్పుడో తెలుసా?

loader