భారత బాక్సర్ అమిత్ పంఘల్ మరో చరిత్ర సృష్టించాడు. రష్యాలోని ఎక్తరిన్‌బర్గ్‌లో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌ ఫైనల్‌‌లో రజత పతకం సాధించిన తొలి భారత బాక్సర్‌గా రికార్డుల్లోకెక్కాడు.

శనివారం ఫైనల్‌లో 2016 ఒలింపిక్ బంగారు పతక విజేత అయిన ఉజ్బెకిస్తాన్‌కు చెందిన షఖోబిదిన్ జొయిర్‌రోవ్ చేతిలో అమిత్ 0-5తో ఓటమి పాలై రజతంతో సరిపెట్టుకున్నాడు.

ఇక ఈ పోటీల్లో సెమీస్‌లో ఓడిన మరో భారత బాక్సర్ మనీశ్ కౌశిక్ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. దీంతో భారత్‌ ఖాతాలో రెండు పతకాలు చేరాయి.

మొత్తం మీద ఒక ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో భారత్‌కు రెండు పతకాలు రావడంతో ఇదే తొలిసారి. గతంలో విజేందర్ సింగ్, విశాక్ కృష్ణన్, గౌరవ్ బిదూరిలు కాంస్య పతకాలు సాధించారు.