Asianet News TeluguAsianet News Telugu

రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఏం జరుగుతుంది..?

ఒకరోజు దేవర్షి నారదుడు పీపిల వృక్ష సమీపంలో వంటరిగా ఉన్న బాలుని చూసిన నారదుడు, నాయన! నీవు మహర్షి దధీచి కుమారుడవు. మీ తండ్రి  ఎముకల నుండి వజ్రాయుధాన్ని తయారు చేసి దేవతలు రాక్షసులను జయించారు

What happens if you make rounds around the mango tree ..?
Author
Hyderabad, First Published Jul 3, 2021, 3:08 PM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

What happens if you make rounds around the mango tree ..?

మహర్షి దధీచి మహర్షి, దేవతల రాజైన ఇంద్రుని ఆయుధం కొరకు తన ఎముకల ఇవ్వగా మిగిలిన, నిర్జీవ శరీరాన్ని శ్మశానవాటికలో దహనం చేస్తున్నప్పుడు దధీచి భార్య ఆ స్మశాన వాటిక సమీపంలో ఉన్న ఒక పెద్ద రావి(పీఫల)చెట్టు కింద ఒక పెద్దకుండలో తమ మూడు ఏండ్ల బాలుడిని ఉంచి, ఆమె భర్త చితిలో చేరి సతిగా మారింది. కుండలో పడిన రావిపండ్లు తిని ఆ బాలుడు పెరిగాడు.
  
ఒకరోజు దేవర్షి నారదుడు పీపిల వృక్ష సమీపంలో వంటరిగా ఉన్న బాలుని చూసిన నారదుడు, నాయన! నీవు మహర్షి దధీచి కుమారుడవు. మీ తండ్రి  ఎముకల నుండి వజ్రాయుధాన్ని తయారు చేసి దేవతలు రాక్షసులను జయించారు. మీ తండ్రి దధీచి 31 సంవత్సరాల వయసులోనే మరణించారని  నారదుడు బాలునికి వివరించాడు, నాకు బాల్యం నుండి అనాధగా మారడానికి  కారణం ఏమిటి? అని అడిగినప్పుడు, అతని బాల్యంలో శని మహాదశ నడుస్తుండేదని తెలిపాడు. ఈ విషయం చెప్పిన తరువాత, దేవర్షి నారద పీపల ఆకులు మరియు పండ్లు తినడం ద్వారా జీవించిన బిడ్డకు పిప్పిలాదుడు అనీ పేరు పెట్టి, బ్రహ్మ కొరకు తపస్సు చేయమని దీవించి వెళ్ళారు.

తరువాత పిప్పలదాడు  తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మ ను మెప్పించి దర్శనం పొందాడు. బ్రహ్మ పిప్పిలాదునికి వరం కోరుకోమని అడిగినప్పుడు, పిప్పిలాదుడు, తన కంటితో ఎదురుగా ఉన్న వస్తువు గానీ, దేవ, దానవ, మానవులు నేను తీక్షణంగా చూస్తే  కాలిపోయే శక్తిని ప్రసాదించమని బ్రహ్మ నుండి వరం పొందారు. తరువాత, పిప్పిలాదుడు మొదట శనిని పిలిచి అతని ముందు తీక్షణంగా కళ్ళు తెరిచి చూడడంతో శనిగ్రహం కాలిపోతూ వుండడంతో విశ్వంలో ఆందోళన ఏర్పడింది.  చివరికి బ్రహ్మ స్వయంగా పిప్పిలాదుడు ముందు కనిపించి శనిని వదిలి వెయ్యమని వేయమని కోరాడు బ్రహ్మ, కాని పిప్పలాదుడు అందుకు సిద్దంగా లేడు బ్రహ్మ, సూర్యది దేవతలు, వేడుకోగాచివరికి సరేనని సమ్మతించి... మరో రెండు వరాలు కోరాడు.

1- పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాల వరకు ఏ బిడ్డ యొక్క జాతకంలో శని ప్రభావం ఉండకూడదు, అలాగే నాలాంటి మరే పిల్లలు మారకూడదు 

2- పీప్పిల చెట్టు అనాధ నైన నాకు అండగా నిలిచింది.  అందువల్ల, సూర్యోదయానికి ముందు పీప్పిల వృక్షానికి నీరు పోసి పూజించే వారిపై శని  ప్రభావం పడదని వరం పొందాడు బ్రహ్మ 'అతనికి వరం ఇచ్చాడు. అప్పుడు పిప్పిలాదుడు తన బ్రహ్మదండంతో శని పాదాలకు కొట్టడం మండుతున్న అగ్ని అగిపోయుంది. అప్పటినుండి మునుపటిలా వేగంగా నడవలేకపోయాడు. అందువల్ల, శనిని "శనియా చారతి యా: శనైష్చరా" అని పిలుస్తారు, అంటే నెమ్మదిగా నడిచే వ్యక్తి అని రావిచెట్టు చుట్టూ తిరిగి ఆరాధించడం వెనక ఉద్దేశ్యం ఇదే. పిప్పలాదుడు ప్రశ్నోపనిషత్తును స్వరపరిచారు, ఇది ఇప్పటికీ విజ్ఞాన విస్తారమైన నిల్వగా ఉంది.

108 ఉపనిషత్తులలో కఠోపనిషత్తు తరువాత నాలుగవ ఉపనిషత్తు ప్రశ్నోపనిషత్తు. ఈ ఉపనిషత్తు అంతా ప్రశ్నలతో నడుస్తుంది. ఈ ఉపనిషత్తులో 6 ప్రశ్నలు వస్తాయి. ఆదిశంకరాచార్యులు ఈ ఉపనిషత్తుకి భాష్యం వ్రాశారు. పిప్పలాదుడు అనే బ్రహ్మవేత్తను ఆరుగురు మహర్షులు వచ్చి ఆరు ప్రశ్నలు వేస్తారు. మెదటి నాలుగు ప్రశ్నలు ప్రాణానికి సంబధించింది. తరువాతి ప్రశ్నలు ప్రణవానికి సంబంధించింది.ఇందులోని విషయములు ఆరువిధములుగ విభక్తములు. ఈప్రశ్నలు విద్యార్థుల వలన గురువును గురుంచి వేయబడినవి. అందువల్ల దీనికీపేరు వచ్చెనని భావింపవచ్చును. ఆ ప్రశ్నలెటువంటివన్న... 

1) ప్రజాపతి ఉత్పత్తి. 

2) ప్రాణవాయువుయొక్క ఔన్నత్యము 

3) శరీరధాతువులయొక్క విధాగమును గూర్చి 

4) జాగ్రత్సప్నావస్థల గురుంచి 

5) ఓంకారధ్యానము గురుంచి 

6) మనుష్యులయందున్న షోడశభాగముల గురుంచి.

Follow Us:
Download App:
  • android
  • ios