విజయ ఏకాదశి.. వ్రత కథ వింటే చాలు పాపాలన్నీ తొలగిపోతాయి

ఒకానోకసారి నారద ముని బ్రహ్మ దేవుడి దగరికి వెళ్లి తనకి ఈ విజయ ఏకాదశి యొక్క విశిష్టతను తెలుపమని కోరెను అప్పుడు బ్రహ్మ ఈ విధంగా చెప్పనారంబించెను. ఓ నారద మహాముని ఇంతకు ముందు ఎవరికీ దీని వ్రత మహత్యం గురించి చెప్ప లేదు నువ్వు అడిగినవు కావున నీకు తెలియ చేసెదను వినుము. 

Vijaya Ekadashi 2020 Date Muhurat Puja Vidhi And Significance

యుధిష్టిర మహారాజు శ్రీ కృష్ణ భగవానునితో ఇలా అన్నాడు  " ఓ వాసుదేవ ,ఈ మాఘ మాసం కృష్ణ పక్షం లో వచ్చేటువంటి ఏకాదశి మహత్యాన్ని వివరించమని కోరాడు. శ్రీ కృష్ణ పరమాత్మ :- ఓ యుధిష్టిర ఈ మాఘమాసంలో వచ్చేటువంటి ఏకాదశి పేరు "విజయ ఏకాదశి" ఈ ఏకాదశిని ఎవరు భక్తీ శ్రద్దలతో ఆచరిస్తారో వారిని విజయం వరిస్తుంది, మరియు వారి పాపాలు కూడా తొలిగిపోతాయి. 

ఒకానోకసారి నారద ముని బ్రహ్మ దేవుడి దగరికి వెళ్లి తనకి ఈ విజయ ఏకాదశి యొక్క విశిష్టతను తెలుపమని కోరెను అప్పుడు బ్రహ్మ ఈ విధంగా చెప్పనారంబించెను. ఓ నారద మహాముని ఇంతకు ముందు ఎవరికీ దీని వ్రత మహత్యం గురించి చెప్ప లేదు నువ్వు అడిగినవు కావున నీకు తెలియ చేసెదను వినుము. ఈ ఏకాదశి వ్రతం అన్ని పాపాలను హరిస్తుంది. ఈ పేరులో చెప్పిన విదంగానే ఈ ఏకాదశి వ్రతం అన్ని విజయాలను చేకూరుస్తుంది అందుకు సందేహమే లేదు. 

శ్రీ రామ చంద్రుడు పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసం చేయునప్పుడు సీత , లక్ష్మణునితో కలిసి పంచవటిలో నివసించేవాడు. రావణడు సీతాదేవిని అపహరించినప్పుడు శ్రీరాముడు దిగులుతో అన్ని కొలుపొయినవాడిలా గుండెను సీతాదేవి ని వెతికే క్రమంలో జటాయువు మరనిన్చబోతుండగా చూసి ఏమయినది అని వివరం అడుగగా జటాయువు సీతమ్మని రావణాసురుడు ఎలా అపహరించాడో సీతామాతని కాపాడబోయి రావణుడి చేతిలో రెక్కలు తెగి పడిన విషయం వివరింఛి మరణిస్తాడు. శ్రీ రాముడు తన సీతా కోసం జటాయువు చేసిన ప్రాణ త్యాగానికి జటాయువికి వైకుంట లోక ప్రాప్తి ప్రసాదిస్తాడు. సీతా దేవిని వెతికే క్రమంలో కబందుడిని సంహరిస్తాడు. 

ఆ తరువాత శ్రీరాముడు సుగ్రీవుడు స్నేహితులవుతారు . సుగ్రీవుడు వానర సేనకు రాజు అగుట చేత సీతమ్మవారిని వెతకడానికి పెద్ద వానర సేనని తయారు చేసి హనుమంతుని సీతమ్మను వెతకడానికి లంకకు వెళ్లి వెతకమని ఆజ్గ్న వేస్తాడు. హనుమ లంక లో సీతమ్మను అశోకవనంలో చూసి శ్రీరాముని ముద్రికని చూపి అయన గుణగణాలను కొనియాడి హితవు పలికి సీతాదేవి దగ్గర ఉంగరం తీసుకుని తిరిగి శ్రీ రాముని వద్దకు వచ్చి వివరించెను. శ్రీ రాముడు సుగ్రీవుని సహాయంతో లంకా నగరానికి వెళ్ళాలంటే ఆ సముద్రాని దాటడం అంత సులువు కాదని గ్రహించి లక్ష్మణునితో ఇలా అన్నాడు, ఓ సుమిత్ర కుమారా ఈ సముద్రముని దాటడం అంత సులువు కాదే ఇప్పుడు మనం ఏమి చేయవలను..? అనగా  ఒక గొప్ప ఋషి ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాడు అ ఉత్తముడిని అడిగి మన కర్తవ్యమ్ ఏమిటో కనుకుందాం. అయన మాత్రమే మనకి ఈ సమయంలో సహాయపడగలరు, ఆ తరవాత ఆ ఋషి దగ్గరకి బయల్దేరారు. ఋషిని చేరుతూనే నమస్కరించి కుశలములు అడిగి వారు వచ్చిన పనిని వివరించారు . 

ఋషి రామునితో ఇలా అంటాడు, శ్రీ రామ నేను నీకు ఒక ఉపవాస దీక్షను వివరిస్తాను శ్రద్ధగా వినుము, దీని ఆచరించడం ద్వార నీకు తప్పకుండ విజయం లభీస్తుంది. ఏకాదశి ముందు రోజు ఒక వెండి, ఇత్తడి , లేదా, బంగారం ఏది లేకపోతె మట్టి కుండ ఒకటి తీసుకుని అందులో నీలు పోసి నవధాన్యాలు, పసుపు కుంకుమ వేసి కుండకి తోరణాలు కట్టి అందంగా అలకరించా లి. దీనిని  శ్రీమన్నారాయణుడి దగ్గర పెట్టాలి. మరునాడు ఏకాదశి ఉదయమే స్నానం చేసి భక్తీ శ్రద్ధలతో శ్రీమన్నారాయణుకి పూజ చేసి ఈ కుండకి  పసుపు కుంకుమ , గంధం , అక్షింతలు వేసి నమస్కరించి ఉపవసించి  రాత్రి కి జాగరణ చేయాలి. మరునాడు ద్వాదశి తిథి రాగానే మల్లి ఆ కుండకి పూజ చేసి ఏదైనా ఒక నదిలో కలిపేయాలి. తరువాత ఎవరికైనా భోజనం పెట్టి నువ్వు భోజనం చేయాలి. ఈ విధం నువ్వు ఉపవాసం చేస్తే తప్పకుండ విజయం లభిస్తుంది అని చెప్పను. 

శ్రీ రామచంద్రుడు ఋషి చెప్పినట్టుగానే వ్రతం పాటించి లంక మీద విజయం సాదించాడు. ఈ వ్రతం ఎవరు అయితే ఆచరిస్తారో వారికి వైకుంట ప్రాప్తి కూడా కలుగుతుంది. ఓ నారద ఈ విధంగా  ఎవరు ఈ ఏకాదశి వ్రతం నమ్మకంతో భక్తీ శ్రద్ధలతో ఆచరిస్తారో వారి అతి ఘోరమైన పాపాలు అయిననూ హరించిపొయి విజయం లబిస్తుంది మరియు వైకుంఠ లోక ప్రాప్తి లబిస్తుంది. అని శ్రీ కృష్ణ పరమాత్మ వివరించి యుధిష్టిర ఎవరు ఈ ఉపవాస దీక్ష చేస్తారో ఈ కధ ను వింటారో వారికీ అశ్వమేధ యాగం చేసిన ఫలితం కూడ లభిస్తుంది అని తెలుపెను.

Vijaya Ekadashi 2020 Date Muhurat Puja Vidhi And Significance

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios