వాస్తు ప్రకారం సింహద్వార గేట్ల అమరిక
స్థలం ఆక్రమణకు గురి కాకుండా, దొంగతనం జరగకుండా యజమాని ఆర్థికంగా నష్టపోకుండా ప్రహరీ చూస్తుంది. ఇల్లు యజమానికి రక్షణగా నిలుస్తుంటే.. ప్రహరీ గృహానికి రక్షణగా నిలుస్తుంది.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
ఓం గృహదోషనివర్తకాయ నమః । కులిశాయుధభూషణాయ ।
కృష్ణవస్త్రధరాయ । ఆయుర్బలయశోదాయ । మాషబలిప్రియాయ ।
దీర్ఘనేత్రాయ । నిద్రాప్రియాయ । దారిద్ర్యహరణాయ । సుఖశయనదాయ ।
సౌభాగ్యదాయ నమః
ఆర్థికంగా ఆటంకాలు లేకుండా ఇంటిని నిర్మించడ కోసం ఇల్లు కట్టే స్థలానికి ప్రహరీ ఉండటం ఎంతో అవసరం. ఇంటిని కాపాడే ప్రహరీ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందమైన గృహాన్ని నిర్మించుకోవాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా గృహప్రవేశం చేయాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ఇంటి నిర్మాణం సాఫీగా సాగాలి అంటే ముఖ్యంగా ఆ గృహం నిర్మించే స్థలానికి 'ప్రహరీ' నిర్మాణం అత్యావశ్యకం. ప్రహరీ అనేది ప్రహారము (పరిహారం) అనే పదం నుంచి వచ్చింది. ప్రహారం అనగా దెబ్బ అని అర్థం. గృహనిర్మాణ స్థలంపై ఇరుగు, పొరుగు వారి నేత్ర దృష్టి పడకుండా ఈ ప్రహరీ కాపాడుతుంది.
స్థలం ఆక్రమణకు గురి కాకుండా, దొంగతనం జరగకుండా యజమాని ఆర్థికంగా నష్టపోకుండా ప్రహరీ చూస్తుంది. ఇల్లు యజమానికి రక్షణగా నిలుస్తుంటే.. ప్రహరీ గృహానికి రక్షణగా నిలుస్తుంది. జంతువులు ప్రవేశించకుండా, నిర్మాణ స్థలంలో వస్తువులు తస్కరణకు గురికాకుండా.. ప్రకృతిలో ఏర్పడే వ్యత్యాసాలు చేసే దుష్పరిణామాల నుంచి గృహానికి, స్థలానికి రక్షణగా నిలుస్తుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం ప్రహరీ నిర్మాణం ఎలా చేయాలనే అంశానికి సంబంధించి ముఖ్య విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణ నైరుతిని ములమట్టానికి ఉంచి ప్రహరీ నిర్మాణము చేయాలి. ఇలా చేయడం వల్ల గృహం ఐమూల తిరగకుండా ఉంటుంది. నైరుతి మూలమట్టం తీసుకుంటే.. ఆగ్నేయం వరకు సమాంతర నిర్మాణం జరిగి.. ఆగ్నేయం వైపు పెరుగుట, తరుగుట.. అలాగే వాయువ్యం వరకు పెరుగుట, తరుగుట జరగదు.
దీని వల్ల యజమాని కుటుంబానికి ఎలాంటి దృష్టి దోషాల ప్రభావం పడకుండా యజమానికి సుఖసంతోషాలు కలుగుతాయి. ప్రహరీ నిర్మాణం జరిగిన తర్వాత నిర్మాణ స్థలంలో ఎత్తు పల్లల్ని సరిచేసుకొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎత్తు పల్లాల వల్ల కలిగే దోషాలను నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
ప్రహరీ నిర్మాణం తర్వాత ముఖ్యమైంది గేటు ఏర్పాటు చేయడం. గేటు ఎప్పుడూ ఉచ్ఛస్థితిలో ఏర్పాటు చేసుకొంటే యజమాని, కుటుంబ సభ్యులు ఎవరికీ ఆరోగ్య పరంగా, ఆర్థికంగా మానసిక సమస్యలకు గురి కాకుండా రక్షణగా నిలుస్తుంది. ప్రహరీ నిర్మాణం ఎప్పుడూ సమాంతరంగా జరగాలి. ఉత్తరం గోడ కన్నా దక్షిణం గోడ ఎత్తుగా ఉండాలి, తూర్పు గోడ కన్నా పడమర గోడ ఎత్తుగా ఉండాలి అనేది శాస్త్ర విరుద్ధం. ప్రహరీ మనకు రక్షణగా నిలవాలి. శాస్త్రం మీద అవగాహన లేకుండా ప్రహరీ నిర్మాణంపై యజమానికి లేని పొని సందేహాలు సృష్టించకూడదు.
* ఆగ్నేయ స్థలంలో తూర్పు సింహద్వార గృహం కట్టడం శ్రేయస్కరం. కాబట్టి ప్రహరీ గేట్లు కూడా తూర్పు ఈశాన్యం, తూర్పు ఉచ్ఛ స్థానంలో పెట్టుకోవడం మంచిది.
* దక్షిణ స్థలంలో గేటు దక్షిణ స్థలంలో నిర్మించిన గృహంలో దక్షిణం ఉచ్ఛ స్థానం నుండి దక్షిణ ఆగ్నేయం వరకు ఉన్న స్థలంలో సింహద్వారం ఎదురుగా గేటు పెట్టాలి.
* తూర్పు దిశన రెండు గేట్లు పెట్టాలను కుంటే తూర్పు ఈశాన్యంలో పెద్దగేటు, తూర్పు ఉచ్ఛ స్థానంలో సింహద్వారం ఎదురుగా చిన్న గేటు, ఉత్తరం ఉచ్ఛ స్థానంలో సింహద్వారం ఎదురుగా చిన్న గేటు పెట్టాలి.
* నైరుతి స్థలంలో గేటు నైరుతి స్థలంలో నిర్మించిన గృహంలో దక్షిణ లేదా పశ్చిమ దిశలలో ఏదో ఒక దిశకు మాత్రమే సింహద్వారం, ఇతర వాస్తు విషయాలు దృష్టిలో పెట్టుకుని గేటు పెట్టాలి.
* దక్షిణం ఉచ్ఛ స్థానం నుండి దక్షిణ ఆగ్నేయం వరకు, పశ్చిమ ఉచ్ఛ స్థానం నుండి పశ్చిమ వాయువ్యంలో గేటు పెట్టాలి.
* ఉత్తర దిశను ఉత్తర ఉచ్ఛ స్థానం ఈశాన్యం వరకు, పశ్చిమ ఉచ్చ స్థానం నుండి పశ్చిమ వాయువ్యం వరకు ఎక్కడైనా సింహ ద్వారం ఎదురుగా గేటు పెట్టుకోవాలి.
* విశాలమైన ఆవరణ కలిగి రెండు గేట్లు పెట్టదలచినపుడు పశ్చిమ వాయువ్యంలో పెద్దగేటు, పశ్చిమ ఉచ్ఛ స్థానంలో సింహద్వారం ఎదురుగా చిన్న గేటు పెట్టాలి.
* అలాగే.. వాయువ్య స్థలంలో గేటు వాయువ్య స్థలంలో నిర్మించిన గృహంలో అవసరాన్ని, సింహ ద్వారాన్ని బట్టి రెండు వైపులకు లేదా కేవలం ఒకవైపుకు పెట్టుకోవచ్చును.