Food

మొక్కజొన్న తింటే ఏమౌతుందో తెలుసా


 

Image credits: Getty

డయాబెటిస్

మొక్కజొన్నలో ముఖ్యంగా ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ చేస్తుంది. అంటే మొక్క జొన్న డయాబెటీస్ పేషెంట్లకు మంచి మేలు చేస్తుంది. 

Image credits: Getty

బరువు తగ్గడం

అవును మొక్కజొన్న మీరు హెల్తీగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. దీనిలో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తింటే మీ ఆకలి చాలా వరకు తగ్గుతుంది. 

Image credits: Getty

రోగనిరోధక శక్తి

మొక్కజొన్న మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది. ఎందుకంటే దీనిలో మన రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. 

Image credits: Getty

గుండె ఆరోగ్యం

హైబీపీని, కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయడానికి కూడా మొక్కజొన్న బాగా సహాయపడుతుంది. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. 
 

Image credits: Getty

జీర్ణక్రియ

మొక్కజొన్నను తింటే జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్దకాన్ని తగ్గించి జీర్ణం సాఫీగా అయ్యేలా చేస్తుంది. జీర్ణ సమస్యల్ని తగ్గిస్తుంది. 

Image credits: Getty

కళ్ల ఆరోగ్యం

మొక్కజొన్నను తింటే మన కళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. దీనిలో ఉండే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు కంటి సమస్యలు రాకుండా కాపాడుతాయి. 

Image credits: Getty

రక్తహీనత

మొక్కజొన్న ఒంట్లో రక్తం పెంచడానికి సహాయపడుతుంది. దీనిలో ఉండే విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్, ఇనుము ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడతాయి. 

Image credits: Getty

అవకాడో రెగ్యులర్ గా తింటే కలిగే ప్రయోజనాలు ఇవే

మధ్యాహ్న భోజనంలో పెరుగు తింటే ఏమౌతుంది?

ఈ పండ్లు తింటే బరువు తగ్గడం పక్కా..!

40 ఏళ్లు దాటిన మహిళలు కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ ఇవి