నరక చతుర్దశి పూజా సమయం, విధానం.. పూర్తి వివరాలివే!
అశ్విని మాసంలో వచ్చే చివరి అతి పెద్ద పండుగ దీపావళి. ఈ దీపావళి పండుగను చిన్నా పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఘనంగా సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ దీపావళి పండుగ సమయంలో నరక చతుర్దశి అనేది అత్యంత ముఖ్యమైన రోజు అని చెప్పవచ్చు.
అశ్విని మాసంలో వచ్చే చివరి అతి పెద్ద పండుగ దీపావళి. ఈ దీపావళి పండుగను చిన్నా పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఘనంగా సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ దీపావళి పండుగ సమయంలో నరక చతుర్దశి అనేది అత్యంత ముఖ్యమైన రోజు అని చెప్పవచ్చు. త్రయోదశి అనగా అశ్విని మాసంలోని కృష్ణపక్షం ధన్తేరస్ నుండి ప్రారంభం అవుతుంది. దీపావళి పండుగకు ఒక రోజు ముందు నరక చతుర్దశి ని జరుపుకుంటారు. మరక చతుర్దశి రోజున శ్రీకృష్ణుడు, కాళీదేవి, యమరాజును పూజిస్తారు. అదేవిధంగా నరక చతుర్దశి రోజున నూనెతో స్నానం చేసే ఒక సంప్రదాయం ఎప్పటినుంచో ఉంది. నరక చతుర్దశి రోజు శుభ సమయం, పూజా విధానం,అలాగే కొన్ని పద్ధతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అశ్విని మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి తేదీ అక్టోబర్ 23న సాయంత్రం 06:03 గంటలకు ప్రారంభం అవుతుంది. నరక చతుర్దశి తిథి అక్టోబర్ 24 సాయంత్రం 05:27 గంటలకు ముగుస్తుంది. అంటే ఈ ఏడాది అక్టోబర్ 24 నరక చతుర్దశి అలాగే దీపావళి ఒకే రోజున వచ్చాయి. అభ్యంగ షన్న ముహూర్తం 24 అక్టోబర్ 2022 ఉదయం 05:08 నుంచి 06:31 వరకు. అంటే మొత్తం 1 గంట 23 నిమిషాలు.
కాళీ చౌదాస్ ముహూర్తం విషయానికి వస్తే.. కాళీ చౌదాస్ ను అక్టోబర్ 23న జరుపుకుంటారు. అక్టోబర్ 23, 2022 11:42 నుంచి అక్టోబర్ 24, 2022,12:33 తె వరకు. నరక చతుర్దశి రోజు ఏం చేయాలి అంటే.. నరక చతుర్దశి రోజున ఉదయాన్నే శరీరానికి నూనె రాసుకుని తల స్నానం చేయాలి. అయితే పురాణాల ప్రకారం నరక చతుర్దశి రోజున శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించాడు. అందుకే శ్రీకృష్ణుడిని ఆ రోజున భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.
అలాగే సాయంత్రం ముఖద్వారం వద్ద దీపం వెలిగించండి. అలాగే యమరాజుకు ప్రత్యేకంగా పిండితో నాలుగు దిక్కుల దీపం చేసి నూనెతో దీపం వెలిగించాలి. సాయంత్రం నరక చతుర్దశి నాడు దక్షిణ దిక్కుకు అభిముఖంగా కూర్చోవాలి. పూజా విధానం విషయానికి వస్తే.. నరక చతుర్దశి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి నూనె రాసి స్నానం చేసి కొత్త బట్టలను ధరించాలి. ఆ రోజున యమరాజు, శ్రీకృష్ణుడు, కాళీమాత, శివుడు, హనుమంతుడు, విష్ణువుల వామన రూపానికి ప్రత్యేకంగా పూజలు చేయాలి. అలాగే ఈ దేవతల విగ్రహాలను ఇంటి ఈశాన్యం మూలలో ప్రతిష్టించి నిత్యం పూజించాలి. ధూపం వెలిగించి దేవతల ముందు దీపం కుంకుమ తిలకం మంత్రాలను జపించాలి.