కార్తీక పౌర్ణమి రోజున చంద్ర గ్రహణం.. మనకు వర్తిస్తుందా..?

ఈ పాక్షిక చంద్రగ్రహణాన్ని ఉత్తర అమెరికా ఖండంలోని 50 దేశాల వారు పూర్తిగా వీక్షించవచ్చు. దక్షిణ అమెరికా ఖండంలోని మెక్సికోలో కనబడుతుంది. ఈ గ్రహం 3.28 గంటలపాటు కొనసాగనున్నది.

Lunar eclipse On Karthika Pournami

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

19 నవంబర్ 2021 శుక్రవారం, కార్తీకపౌర్ణమి రోజున వృషభరాశిలో రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం. ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం ఏర్పడనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ  నవంబరు 18, 19 తేదీల్లో వివిధ సమయాల్లో ఈ గ్రహణం కనిపించనుంది. భారతకాలమానం ప్రకారం నవంబరు 19న శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ చంద్రగ్రహణం ఉచ్ఛస్థితికి చేరుతుంది. 2001 నుంచి 2100 మధ్య అత్యంత సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం ఇదే. ఇది పాక్షిక చంద్ర గ్రహణమే అయినా ఏకంగా 3 గంటల 28 నిమిషాల పాటు కనువిందు చేయనుంది. 

ఈ పాక్షిక చంద్రగ్రహణాన్ని ఉత్తర అమెరికా ఖండంలోని 50 దేశాల వారు పూర్తిగా వీక్షించవచ్చు. దక్షిణ అమెరికా ఖండంలోని మెక్సికోలో కనబడుతుంది. ఈ గ్రహం 3.28 గంటలపాటు కొనసాగనున్నది. ఈ సమయంలో చంద్రుని ఉపరితలం మొత్తం 97 శాతం ఎర్రగా కనిపిస్తుంది, చంద్రుడు ఎవరికీ కనిపించకుండా ఈ పాక్షిక గ్రహణం దాచేస్తుంది, అరుణ వర్ణంలో చంద్రుడు కనిపించడాన్ని బ్లడ్‌ మూన్ , సూపర్‌ మూన్‌ గా పిలుస్తారు. ఇది భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అసోం తదితర ప్రాంతాల్లో స్వల్పంగా ఏర్పడనున్నది.  

గ్రహాణాలు ఎలా ఏర్పడతాయి:- సూర్యునికి, భూమికి చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. 

* చంద్ర గ్రహణం:- చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చి చంద్రుడి మీద భూమి నీడ పడుతుంది. దీనినే చంద్ర గ్రహణం అంటారు. ఇది ఎప్పుడూ పౌర్ణమి నాడు కనిపిస్తుంది.

* రవి, భూమి ఎప్పటికీ ఒకే మార్గంలో ఉన్నప్పటికీ చంద్రుడు ఈ మార్గానికి 5 డిగ్రీలు పరిధిలో అటూ ఇటూ తిరుగుతుంటాడు. 

* రవి, చంద్రులకు మధ్యలో భూమి ఉన్న రోజున పూర్ణిమ అవుతుంది. అయితే రవి, భూమి , చంద్రులు ఒకే సరళరేఖలో ఉండి చంద్రుడు రాహువు వద్ద గానీ కేతువు వద్దగానీ ఉన్నప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. 

* పూర్తి చంద్రబింబం కనబడకపోతే దాన్ని సంపూర్ణ చంద్ర గ్రహణం అని అంటారు.

*  కొంత భాగం కనిపించక పొతే దానిని పాక్షిక చంద్రగ్రహణం అంటాం. 

* సూర్యుని కాంతి చంద్రుని పైన పడుతుంది. భూమి నీడ పరిధిలోకి చంద్రుడు వచ్చినప్పుడు భూమి నీడ పరిధి దాటేంత వరకు పూర్తిగా కనిపించకుండా ఉంటాడు. ఈ స్థితినే గ్రహణం అని అంటాం. రాహువు వద్దకు గానీ కేతువు వద్దకు గానీ ఈ గ్రహాలు వచ్చినప్పుడు గ్రహణం ఏర్పడుతుంది. 

ఈ గ్రహణం కార్తీక పౌర్ణమి నాడు ఏర్పడుతుండగా.. మంచుతో కప్పబడిన చంద్రుడి ఫ్రాస్ట్ మూన్ గా అని పిలుస్తారు. శరదృతువు చివరిలో ఏర్పడే మంచు కారణంగా దానికి ఆ పేరు వచ్చింది. భూమి నీడ చంద్రుడిపై పడటంతో పూర్తిగా కప్పివేసే సంపూర్ణ చంద్రగ్రహణంలా ఇది అద్భుతమైనది కానప్పటికీ ఈ పాక్షిక గ్రహణం చంద్రుని ఉపరితలంలో 97% కనిపించకుండా దాచేస్తుంది.

ఈ గ్రహణం మనకు వర్తించదు :- తెలుగురాష్ట్రాలకు ఈ గ్రహణం వర్తించదు. ఎలాంటి నియమాలు పాటించనవసరం లేదు. భారతదేశ కాలమానం ప్రకారం 19 తేదీ శుక్రవారం రోజు పౌర్ణిమ ఘడియలు మధ్యాహ్నం 2 : 27 వరకే ఉన్నాయి. విదేశాలలో ఏర్పడే పాక్షిక చంద్ర గ్రహణానికి గ్రహణ పట్టు, విడుపు స్నానాలు, ఇతర సాంప్రదాయ ఆచారాలు ఏమి పాటించనవసరం లేదు. గర్భిణీ స్త్రీలు ఎలాంటి భయాందోళనలు పడకూడదు. నిశ్చింతగా ప్రతిరోజూ లాగే ఈ రోజు ఉండవచ్చును.      

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios