లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పూజలు, హోమాలు చేసేవారు కూడా ఉన్నారు. అయితే, రోజూ కేవలం ఒక పని ఇంటి యజమాని చేయడం వల్ల వారి ఇంట లక్ష్మీదేవి అడుగుపెడుతుంది..
భారతీయ సంప్రదాయం ప్రకారం, సాధారణంగా అందరూ ఇంట్లో పెద్దల పాదాలను తాకుతూ ఉంటారు. ఈ సంప్రదాయం వెనక చాలా కారణాలు ఉన్నాయి. శాస్త్రాల ప్రకారం, గొప్ప వ్యక్తుల పాదాలను తాకడం వల్ల మన పుణ్యం పెరుగుతుందని నమ్ముతారు. అంతేకాదు.. ఆ పెద్దల ఆశీర్వాదం మనకు లభిస్తుందని భావిస్తారు. వారి ఆశీర్వాదం వల్ల మన దురదృష్టం తొలగిపోయి... మనసుకు ప్రశాంతత లభిస్తుందని నమ్ముతుంటారు.
అంతేకాదు.. పెళ్లి తర్వాత కచ్చితంగా భర్త పాదాలను భార్య తాకాలి అని కూడా మన పెద్దలు చెబుతూ ఉంటారు. పెళ్లి సమయంలో మాత్రమే కాదు.. ఇంట్లో ఏదైనా పూజ, వ్రతం ఏది చేసుకున్నా.. భర్త పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. కానీ.. భార్య పాదాలను భర్త తాకితే ఏమౌతుందో తెలుసా? ఇప్పటి వరకు ఇంట్లో పెద్ద వారు కూడా భర్త పాదాలు భార్య తాకాలి, ఆశీర్వాదం తీసుకోవాలి అన్నారు కానీ.. భార్య పాదాలు భర్త తాకాలని చెప్పి ఉండరు. కానీ, అలా ఆమె పాదాలను తాకడం, పాదాలకు మసాజ్ చేయడం లాంటివి చేస్తే ఏమౌతుంది?
భార్య భర్త పాదాలను తాకి నమస్కారం చేయడం వల్ల మనసులో భక్తి భావం కలుగుతుంది. ఇది అహంకారాన్ని తగ్గిస్తుంది. భర్త పట్ల భార్యకు గౌరవం ఉంటే, భర్తకు భార్య పట్ల బాధ్యత పెరుగుతుందని నమ్ముతారు. అదేవిధంగా భర్త కూడా భార్య పాదాలను తాకాలి లేదా మసాజ్ చేయాలి. భార్యకు ఇంటి పనుల్లో సాయం చేసే భర్తను చాలామంది సేవకుడిలా చూస్తారు. అతను ఆమె పాదాలను తాకితే నవ్వుకునేవారే ఎక్కువ. కానీ దాని వల్ల కలిగే లాభాలు తెలిస్తే మీరూ ఇదే చేస్తారు.
భర్త తన అహంకారాన్ని వదిలి భార్య పాదాలను తాకితే ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. హిందూ ధర్మంలో ప్రతి స్త్రీని దేవతలా భావిస్తారు. కన్య పూజలో ఆడపిల్లలను ప్రత్యేకంగా పూజిస్తారు. మత విశ్వాసం ప్రకారం, కూతురు, కోడలు, అత్తగారు ఉన్న ఇల్లు సంతోషంగా ఉంటుందని నమ్ముతారు. ఇంట్లో ఉన్న స్త్రీలను గౌరవిస్తే పురుషుల కోరికలన్నీ నెరవేరుతాయి. దేవతలు ఆ ఇంట్లో ఉంటారు. ఆ ఇంట్లో లక్ష్మి ఉండటం వల్ల డబ్బు కొరత ఉండదు.
అలాగే జీవితంలో విజయం సాధించాలనుకునే పురుషులు ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే భార్య పాదాలను తాకాలి. అలా చేస్తే జీవితంలో సుఖసంతోషాలతో పాటు అభివృద్ధి కూడా కలుగుతుంది. భార్యను లక్ష్మి దేవితో పోలుస్తారు. లక్ష్మి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి భర్త ఈ ఒక్క పని చేస్తే చాలు.
భార్య పాదాలను తాకడం లేదా మసాజ్ చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాదాలు శని గ్రహంతో సంబంధం కలిగి ఉంటే, చేతులు శుక్ర గ్రహంతో సంబంధం కలిగి ఉంటాయి. ఈ రెండూ తాకినప్పుడు అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. హిందూ ధర్మం ప్రకారం, భర్త భార్య పాదాలను మాత్రమే కాదు, ఆమె అరచేతులను కూడా తాకాలి. ఇది వారి అదృష్టాన్ని బలపరుస్తుంది. మత విశ్వాసాల ప్రకారం, ధనలక్ష్మి స్త్రీల అరచేతుల్లో ఉంటుంది. ఒక వ్యక్తి ప్రతిరోజూ లక్ష్మి దేవిని ధ్యానిస్తూ భార్య అరచేతిని తాకితే, లక్ష్మి దేవి ప్రసన్నమవుతుంది.
