- Home
- Astrology
- Zodiac signs: ఈ రెండు రాశులకు స్నేహం ఎప్పటికీ కుదరదు, పాము, ముంగిసల్లా కొట్టుకుంటారు..!
Zodiac signs: ఈ రెండు రాశులకు స్నేహం ఎప్పటికీ కుదరదు, పాము, ముంగిసల్లా కొట్టుకుంటారు..!
స్నేహం మన జీవితంలో ఎంతో విలువైన భాగం. మన స్నేహితులు.. మనం చేసే తప్పులను క్షమిస్తారు.. మన బలహీనతలను అంగీకరిస్తారు, విజయం సాధిస్తే.. మనకన్నా ఎక్కువ సంతోషిస్తారు. సంబరాలు చేసుకుంటారు. ఇలాంటి స్నేహాన్ని జీవితంలో ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

Zodiac signs
ఇద్దరికి పెళ్లి చేయడానికి జాతకాలు చూడటం చాలా సర్వ సాధారణం. ఇద్దరి జాతకాలు సరిగ్గా కలిస్తేనే వారి జీవితం ఆనందంగా సాగుతుంది అని నమ్ముతుంటారు. అందుకే, హిందూ సంప్రదాయంలో పెళ్లికి ముందు జాతకాలు కచ్చితంగా చెక్ చేస్తారు. కానీ, కొంత మంది స్నేహం కోసం కూడా జాతకాలను పరిశీలిస్తారని మీకు తెలుసా? మీరు చదివింది నిజమే, జాతకాలు కలవకపోతే స్నేహం కూడా కుదరదు.
స్నేహం మన జీవితంలో ఎంతో విలువైన భాగం. మన స్నేహితులు.. మనం చేసే తప్పులను క్షమిస్తారు.. మన బలహీనతలను అంగీకరిస్తారు, విజయం సాధిస్తే.. మనకన్నా ఎక్కువ సంతోషిస్తారు. సంబరాలు చేసుకుంటారు. ఇలాంటి స్నేహాన్ని జీవితంలో ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే.. జోతిష్యశాస్త్రంలో కొన్ని రాశి చక్రాలు ఒకరితో మరొకరికి అనుకూలత ఉండదు. దీని కారణంగా స్నేహ బంధం కూడా కుదరకపోవచ్చు. స్నేహం కుదరకపోవడంతో పాటు... పాము, ముంగిసల్లా కొట్టుకుంటూ ఉంటారు. ఆ రెండు రాశులు పక్క పక్కన ఉంటే.. వారి మధ్య గొడవలు తీర్చలేక తంటాలు పడతారు. మరి, జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏ రాశివారికి ఏ రాశితో స్నేహం కుదరదో, దానికి కారణాలేంటో తెలుసుకుందామా..
1.మేష రాశి- కన్య రాశి...
మేష రాశివారికి ధైర్యం చాలా ఎక్కువ. అంతేకాదు, వీరు ఏధైనా విషయంలో నిర్ణయం తీసుకోవడానికి పెద్దగా ఎక్కువ సమయం తీసుకోరు. చాలా తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. స్ఫూర్తివంతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కానీ.. కన్య రాశివారు అందుకు విరుద్ధం. కన్య రాశి వారి ఆలోచనలు.. మేష రాశివారి కంటే భిన్నంగా ఉంటాయి. కన్య రాశివారు విశ్లేషణాత్మకంగా ఉంటారు. ప్రతి విషయాన్ని చాలా లోతుగా ఆలోచిస్తారు. తొందరగా ఏ నిర్ణయాలు తీసుకోరు.
ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. ఇక.. వీరిద్దరికీ స్నేహం కుదిరితే.. ప్రతి విషయంలో గొడవ పడే అవకాశం ఉంది. ఎందుకంటే.. మేష రాశి వారి స్పీడ్ ని కన్య రాశివారు అందుకోలేరు. కన్య రాశివారు ప్రతి విషయంలో చేసే జాప్యం.. మేష రాశి వారికి చిరాకు తెప్పిస్తుంది. ఈ విషయంలో ఇద్దరికీ పెద్ద పెద్ద గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించరు, అర్థం కూడా చేసుకోరు.కన్య రాశివారిది అశ్రద్ధ అనే భావన మేష రాశిలో ఉంటుంది.. వీరికేమో.. అది తొందరపాటులా అనిపిస్తుంది. వీరి విరుద్ధ స్వభావాలు వారిద్ధరి మధ్య ఎప్పటికప్పుడు విభేదాలు తలెత్తడానికి కారణం అవుతాయి. అందుకే, ఈ రెండు రాశులకు స్నేహం అస్సలు కుదరుదు.
2.వృషభ రాశి- వృశ్చిక రాశి..
వృషభ రాశి వారు జీవితంలో స్థిరత్వాన్ని, భద్రతను కోరుకుంటారు. వారి జీవన శైలి సౌమ్యంగా, నెమ్మదిగా ఉంటుంది. కానీ, వృశ్చిక రాశివారు చాలా మోషనల్ గా ఉంటారు. జీవితంలో వారికి చాలా కలలు, కోరికలు ఉంటాయి. వాటి కోసం పరుగులు తీస్తూ ఉంటారు. అంతేకాదు వీరికి అనుమానం కూడా చాలా ఎక్కువ. అందుకే, వృషభ రాశి వారికి వృశ్చిక రాశివారికి సరిపోలదు. వృషభ రాశి వారు వృశ్చిక రాశివారి కోపాన్ని, అనుమానాన్ని తట్టుకోలేరు. అదేవిధంగా వృశ్చికం వారు వృషభ రాశి మెండితనంతో విసుగు చెందుతారు. ఒకరిపై మరొకరు పూర్తిగా నమ్మకం, విశ్వాసం పెట్టకపోవడం వల్ల, వారి స్నేహం సుదీర్ఘకాలం నిలపడదు. ప్రతి నిమిషం గొడవలు, మనస్పర్థలు వస్తూనే ఉంటాయి. వీరికి స్నేహం కుదరదు. కుదిరినా కొద్ది కాలానికే విడిపోయే అవకాశం ఉంది.
3.మిథున రాశి- ధనస్సు రాశి..
మిథున రాశివారు చాలా చురుకైన మనస్తత్వం కలిగి ఉంటారు. వీరు సామాజికంగా చాలా చురుకుగా ఉంటారు. అన్ని విషయాల్లో ఆసక్తి చూపిస్తారు. కొత్త పాత లేకుండా అందరితోనూ స్నేహం చేస్తారు. ఇక.. ధనస్సు రాశి వారి అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి. వీరు చాలా స్వతంత్రంగా ఉండాలని అనుకుంటారు. ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి కూడా ఇష్టపడరు. కొత్త అనుభవాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రాశులు ప్రారంభంలో మంచి స్నేహితులుగా ఉంటారు. కానీ కాలక్రమేణా వారి జీవనశైలి విభేదాల వలన ఒకరికొకరు అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడతారు. మిథున రాశివారు ఎక్కువ ఎమోషనల్ టచ్ కోరుకుంటే.. ధనస్సు రాశి వారికి అది భారంగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే,వీరు స్నేహం చేయకపోవడమే మంచిది.
4. కర్కాటక రాశి- మకర రాశి..
కర్కాటక రాశి వారు భావోద్వేగాలతో నిండిన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. కుటుంబాన్ని ప్రాధాన్యతగా భావించే వారు. కానీ మకర రాశి వారు ఆచరణాత్మక దృష్టికోణం కలిగి ఉంటారు. ఉద్యోగం, లక్ష్య సాధన పట్ల నిబద్ధత కలిగి ఉంటారు. కర్కాటకం వారు మకరం వారి భావోద్వేగ సపోర్ట్ లేకపోవడాన్ని బాధగా భావిస్తారు. అదే సమయంలో, మకరం వారు కర్కాటకం వారి భావోద్వేగపు మార్పులను, సానుభూతిని అర్థం చేసుకోలేరు. వీరు ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోలేరు. అర్థం చేసుకోలేరు. ఫలితంగా ఈ రెండు రాశులకు పొంతన కుదరదు. పైగా సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
5. సింహ రాశి- కుంభ రాశి..
సింహ రాశి వారు నాయకత్వ ధోరణితో ఉంటారు. శ్రద్ధకు, ప్రశంసలకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ కుంభ రాశి వారు విపరీతంగా స్వతంత్ర మనస్తత్వం కలిగి ఉంటారు. సామాజికంగా ఆధునిక ఆలోచనలతో ముందడుగు వేస్తారు. సింహం వారి "నేను" అనే ధోరణిని కుంభం వారు అంగీకరించరు. అదే విధంగా, కుంభం వారి సామూహిక కార్యకలాపాలను సింహం వారు నిర్లక్ష్యం చేస్తారు. దీనివల్ల వారి స్నేహం స్థిరంగా ఉండదు. వీరిద్దరు ఎక్కడ కలిసి ఉన్నా తరచూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఒకరిని మరొకరు అస్సలు అర్థం చేసుకోరు.
6. మీన రాశి-తుల రాశి..
మీన రాశి వారు కలలు కనేవారు, కవిత్వభరితమైన భావనలతో నిండి ఉంటారు. తుల రాశి వారు సమతుల్యమైన దృష్టికోణం కలిగి, హేతుబద్ధంగా ఆలోచించే వారు. మీన రాశి వారు తుల వారి నిర్ణయాలకు మెచ్చుకుంటారు కానీ, తుల రాశి వారు మీన వారి భావోద్వేగపు అలజడి చూసి విసుగ్గా ఫీలవుతారు. ఇది వారి స్నేహాన్ని అస్థిరతవైపు నడిపిస్తుంది. ఏదో ఒక విషయంలో వీరికి గొడవలు జరిగే అవకాశం ఉంది.
తుది మాట:
జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల మధ్య సహజంగా అనుకూలత ఉండదు. ఇది వారి స్నేహానికి అడ్డుగా నిలవవచ్చు. అయితే, ఇది శాశ్వతం కాదు. సంబంధాలపై విజయం వారి పరస్పర అవగాహన, గౌరవం, ప్రయత్నంపై ఆధారపడి ఉంటుంది. ఎవరైనా మంచి స్నేహితులు కావాలంటే, గ్రహాల కంటే మనసు ముఖ్యం!