ఒక పార్టీకి అనుకులంగా నోటా సినిమా వస్తోందంటూ చెలరేగిన వివాదం తుస్సుమంది. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఓ పార్టీకి అనుకూలంగా ఆ సినిమా వస్తోందంటూ వివాదానికి కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి వివాదానికి తెర తీశారు. ఆ సినిమా విడుదలను ఆపేయాలంటూ కాంగ్రెసు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. 

అయితే, విడుదలైన తర్వాత వివాదానికి తలా తోకా లేదని తేలిపోయింది. చెప్పాలంటే, పొలిటికల్ సినిమాయే కాదు. తమిళనాడుకు చెందిన కొన్ని పరిణామాలను సినిమాలో చూపించినప్పటికీ దాన్ని మాస్ మసాలా సినిమాగా రూపొందించాలని అనుకున్నట్లు సినిమా విడుదలైన తర్వాత అర్థమై పోయింది.

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కు అనుకూలంగా ఆ సినిమా వస్తోందనే ప్రచారం జోరుగా సాగింది. విడుదలయ్యేంత వరకు వ్యాపారపరంగా సినిమా విజయమవుతుందనే పాజిటివ్ టాక్ ఉంటూ వచ్చింది. విడుదలైన తర్వాత దానికి అంత సీన్ లేదని, టీఆర్ఎస్ కూ ఆ సినిమాకు వీసమెత్తు సంబంధం కూడా తేలిపోయింది.

విడుదలకు ముందు హీరో విజయ్ దేవరకొండ చేసిన కొన్ని ప్రకటనల నేపథ్యంలో టీఆర్ఎస్ కు నోటా సినిమా అనుకూలంగానే ఉండవచ్చుననే అభిప్రాయం ఏర్పడింది. వచ్చే ఎన్నికల్లో తిరిగి టీఆర్ఎస్ గెలవాలని అనుకుంటున్నట్లు ఆయన అన్నారు. అంతే కాకుండా కేటిఆర్ ను మక్కీకి మక్కీ కాపీ కొట్టామని కూడా అన్నారు. కేటిఆర్ పై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. దాంతో నిజంగానే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రయోజనం చేకూరే విధంగా సినిమాను తీసి ఉంటారనే అనుమానం బలపడుతూ వచ్చింది. 

విడుదలైన తర్వాత సినిమాలో తెలుగు వాసనలు కూడా లేవని అర్థమైపోయింది. తమిళ రాజకీయాలు తెలుగు ప్రేక్షకులకు పట్టలేదనే విషయం అర్థమైంది. మాస్ మసాలా సినిమాను కూడా సరిగా తీయలేకపోయారనేది అర్థమవుతోంది.

తెలుగులో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ ను వాడుకోవాలని చూశారని సినిమా చూసిన తర్వాత అనిపిస్తూ ఉంది. విజయ్ దేవరకొండ ఎందుకు అటువంటి సినిమాను అంగీకరించాడనేది అర్థం కావడంలేదు. పైగా అంతా ఒక్కడే అయి ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. దక్కిన ఫలితం సున్నా.

ఏదైనా పార్టీకి సినిమా అనుకూలంగా ఉందని చెప్పినా, అలా తీయాలని ప్రయత్నించినా ఆ ఫలితం దక్కే విధంగా కూడా సినిమా నిర్మాణం లేదనేది అర్థమవుతోంది. నిజానికి, విడుదలకు ముందు తలెత్తే వివాదాలు సినిమా విజయానికి తోడ్పడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ సినిమాకు ఆ సీన్ కూడా లేదని తేలిపోయింది. విడుదలకు ముందు చెలరేగిన వివాదం కూడా సినిమాను గట్టెక్కించేట్లు లేదు. 

- కె. నిశాంత్

నోటా రివ్యూ

 

టాటా...( ‘నోటా‌’ మూవీ రివ్యూ )

విజయ్ దేవరకొండ 'నోటా'.. ప్రశంసలతో పాటు విమర్శలు!

'నోటా' ట్విట్టర్ టాక్..!

కేటీఆర్ లుక్స్ ని మక్కీ మక్కీ దింపా: నోటా సినిమాపై విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ 'నోటా' టార్గెట్ ఎంతంటే..?

రష్మిక బ్రేకప్ పై విజయ్ దేవరకొండకి ఊహించని ప్రశ్న!